T20 Match: తొలి టీ20 మ్యాచ్ సౌతాఫ్రికా దే..!

చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌లో సఫారీ మహళ జట్టు గ్రాండ్ విక్టరీతో సతా చాటింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720200078_GRvKO0qXsAEG2xR.jpeg

తొలి టీ20 మ్యాచ్ సౌతాఫ్రికా దే..!

టీమిండియాపై సఫారీ గ్రాండ్ విక్టరీ

తజ్మిన్ బ్రిట్స్ విధ్వంసం  

లారా తుఫాన్ బ్యాటింగ్‌

 

న్యూస్ లైన్ స్పోర్ట్స్: చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ సౌతాఫ్రికా తొలి టీ20 మ్యాచ్‌లో సఫారీ మహళ జట్టు గ్రాండ్ విక్టరీతో సతా చాటింది. సౌతాఫ్రికా బ్యాటర్స్ తజ్మిన్ బ్రిట్స్ హాఫ్ సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ తుఫాన్ బ్యాటింగ్‌తో భారత బౌలర్లకు ఊచకోత చూపించింది. దాంతో దక్షిణాఫ్రికా, టీమిండియా జట్టుపై 12 పరుగుల తేడాతో గెలుపొందింది. 

 

 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మహళ జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభన్ని అందించారు. లారా వోల్వార్డ్ట్, తజ్మిన్ బ్రిట్స్ దూకుడు బ్యాటింగ్‌ చేస్తూ చెపాక్ స్టేడియంలో పరుగుల వరద పారించారు. ఈ జోడి వేగంగా రన్స్ స్కోర్ చేస్తూ 70 పరుగుల కీలక భగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే లారా(33)ను రధ యాదవ్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత మారిజాన్ కాప్ టీమిండియా బౌలర్లపై విరుచుకుపడింది. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేసింది. మరో ఎండ్‌లో బ్రిట్స్( 25 బంతుల్లో 56 పరుగులు 6 ఫొర్లు, 3 సిక్సర్ల)తో అర్థ సెంచరీ పూర్తి చేసుకుంది. ఈ ఇద్దరు కలిసి స్కోర్ బోర్డుకు 100 పరుగులు జతచేశారు. ఇక మారిజాన్ బౌండరీలు, సిక్సర్లు కొడుతూ(33 బంతుల్లో 53 రన్స్ 8 ఫొర్లు, 1 సిక్సర్)తో ఫిఫ్టి పూర్తి చేసింది. అయితే మంచి టచ్‌లో ఉన్న ఈ జోడికి పూజా వస్త్రాకర్ బ్రేక్ వేసింది. ఓ చక్కని బంతితో మారిజాన్(53)ను పూజా పెవిలియన్‌కు పంపింది. దాంతో సౌతాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయి 150 పరుగులు చేసింది. బ్రిట్స్ తుఫాన్ బ్యాటింగ్ చేసింది. బౌండరీలు బాదుతూ టీమిండియా బౌలర్లపై రెచ్చిపోయింది. అయితే బ్రిట్స్(81), పూజా బౌలింగ్‌లో భారీ ష్టార్ ఆడబోయి బౌండరీ వద్ద రధ యాదవ్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాంది. ఈ సమయంలో క్రీజులో దిగిన క్లో ట్రయాన్ ఒక్క మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడింది. దాంతో సఫారీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. భరత బౌలర్లు పూజా వస్త్రాకర్, రధ యాదవ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.  

 

 

భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన టీమిండియా మహళ జట్టకు ఆదిలోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. డేంజరస్ ఓపెనర్ షఫాలీ వర్మ(18) వికెట్‌ను అయాబొంగా ఖాకా పడగొట్టింది. తర్వాత క్రీజులో దిగిన దయాళన్ హేమలత ధనాధన్ బ్యాటింగ్ చేసింది. మంధనతో కలసి మంచి పట్నర్‌షిప్ నెలకొల్పింది. మరోవైపు స్మృతి బౌండరీలు, సిక్సర్ల కొడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. వీళ్లిద్దరూ భారత స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. అయితే ఫిఫ్టి చేరువలో మంధన( 30 బంతుల్లో 47 పరుగులు 7 ఫొర్లు, 2 సిక్సర్లు), క్లో ట్రయాన్ బౌలింగ్‌లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత హేమలత(14) కూడా వెనుదిరిగింది. దాంతో టీమిండియా జట్టు మూడు వికెట్లు కోల్పోయి 80 పరుగులు బాదింది. ఈ సమయంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, జెమీమా రోడ్రిగ్స్ నిలకడగ ఆడుతూ ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఇక జెమీమా సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. వేగంగా పరుగులు చేస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్ళింది. మరోవైపు కౌర్ బౌండరీలు స్కోర్ చేస్తూ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడింది. వేగంగా రన్స్ చేస్తూ రోడ్రిగ్స్(30 బంతుల్లో 53 రన్స్ 7 ఫొర్లు, 1 సిక్సర్)తో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. కాగా, ఈ జోడి టీమిండియా స్కోర్ బోర్డుకు 70 రన్స్ జోడించారు. అయితే మంచి ఫామ్ లో కనిపించిన కౌర్(35)ను నొంకులులేకో మ్లాబా వెనక్కి పంపింది. అయితే జెమీమా(53) ఆఖరి వరకు క్రీజ్ లో ఉండి ఒంటరి పోరాటం చేసింది. కానీ, లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది. దాంతో సౌతాఫ్రికా, భారత మహిళ జట్టుపై 12 పరుగుల తేడాతో తొలి టీ20 మ్యాచ్ లో విజయం సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లు అయ్యాబొంగా ఖాక, నొంకులులేకో మ్లాబా, నడినే డే క్లర్క్, క్లో ట్రయిన్ తలా వికెట్ తీశారు. 

 

newsline-whatsapp-channel
Tags : telangana south-africa won-the-match india

Related Articles