Asia Cup: సెమీ ఫైనల్‌కు శ్రీలంక.!

మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ టోర్నీ‌లో భాగంగా బుధవారం రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది


Published Jul 24, 2024 09:39:24 PM
postImages/2024-07-24/1721837364_lanka.PNG

సెమీ ఫైనల్‌కు శ్రీలంక
థాయిలాండ్ పై లంక గ్రాండ్ విక్టరీ
చమరి ఆటపట్టు సూపర్ ఫిఫ్టి
గుణరత్నే విధ్వంసకర ఇన్నింగ్స్‌

 న్యూస్ లైన్ స్పోర్ట్స్:  మ‌హిళ‌ల‌ ఆసియా క‌ప్ టోర్నీ‌లో భాగంగా బుధవారం రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ మ్యాచ్‌లో శ్రీలంక జట్టు గ్రాండ్ విక్టరీ కొట్టింది. లంక బ్యాటర్లు చమరి ఆటపట్టు సూపర్ హాప్ సెంచరీతో విరుచుకుపడగా..  విష్మి గుణరత్నే విధ్వంసకర ఇన్నింగ్స్‌తో థాయిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేసింది. దాంతో శ్రీలంక, థాయిలాండ్ జట్టుపై 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సెమీ ఫైనల్‌కు చేరింది. జూలై 26న జరిగే సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్‌తో శ్రీలంక జట్టు తడపడనుంది.


టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన థాయిలాండ్ మహిళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఓపెనర్ నట్టయా బూచతం(0), అచ్చిని కులసూర్య బౌలింగ్‌లో డకౌట్‌గా పెవిలియన్‌కు చేరింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నన్నపట్ కొంచరోయెంకై హార్డ్ హిటింగ్ బ్యాటింగ్ చేసింది. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించింది. మరో ఎండ్‌లో అఫిసర సువాన్‌చోంరాతి కూడా మంచి ఇన్నింగ్స్ ఆడింది. ఈ ఇద్దరూ కలిసి లంక స్కోర్ బోర్డుకు 40 పరుగులు జోడించారు. అయితే ఇనోషి ప్రియదర్శని బౌలింగ్‌లో అఫిసర(12) భారీ ష్టార్ట్ అడబోయే బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ఫన్నిత మాయ(2), చనిదా సుత్తిరువాంగ్(4), సువానన్ ఖియాటో(4), సులీపోర్న్ లావోమి(1) బ్యాటర్లు రన్స్ స్కోర్ చేయడంలో విఫలమయ్యారు. ఓవైపు వికెట్లు పడుతున్న నన్నపట్ తుఫాన్ బ్యాటింగ్ చేసింది. కెప్టెన్ తిపట్చా పుట్టావోంగ్‌తో కలిసి 30 పరుగులు కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. అయితే తిపట్చా(13) రనౌట్ అయ్యింది. ఇక నన్నపట్( 44 బంతుల్లో 47 రన్స్ 5 ఫోర్లు నటౌట్) చివరి వరకు క్రీజులో నిలబడి థాయిలాండ్ జట్టుకు ఫైటింట్ టోటాల్ అందించింది. దాంతో థాయిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 93 రన్స్ కొట్టింది. లంక బౌలర్లు కవిషా దిల్హరి రెండు వికెట్లు పడగొట్టాగా.. చమరి అతపత్తు, ఇనోషి ప్రియదర్శని, అచ్చిని కులసూర్య తలా వికెట్ తీశారు. 

స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలో దిగిన శ్రీలంక జట్టుకు మంచి ఆరంభం లభించింది. ఓపెనర్లు విష్మి గుణరత్నే, చమరి ఆటపట్టు ధనాధన బ్యాటింగ్ చేశారు. వీళ్లిందరూ కలిసి వేగంగా పరుగులు స్కోర్ చేశారు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్టేడియంలో పరుగులు వరద పారించారు. ఇక చమరి విధ్వంసకర బ్యాటింగ్‌తో థాయిలాండ్ బౌలర్లను ఉతికి ఆరేసింది. ఇక చమరి ఆట్టపట్టు తుఫాన్ బ్యాటింగ్‌తో (34 బంతుల్లో 50 పరుగులు 2 ఫోర్లు, 4 సిక్సర్లు) సహయంతో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. ఆటపట్టు(50 నటౌట్), విష్మి(39 నటౌట్) జోడి క్రీజులో ఉండి లంక జట్టు భారీ విజయాని అందించారు. 11.3 ఓవర్లలోనే శ్రీలంక జట్టు ఒక్క వికెట్‌ను కోల్పోకుండా టార్గెట్‌ను ఛేదించింది. దాంతో శ్రీలంక, థాయిలాండ్ జట్టుపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో లంక సెమీ ఫైనల్‌కు చేరింది. శుక్రవారం టీమిండియాతో జరిగే సెమీ ఫైనల్ 1 మ్యాచ్‌లో శ్రీలంక జట్టు తలపడనుంది. 
 

newsline-whatsapp-channel
Tags : telangana asia-cup cricket-news srilanka

Related Articles