Taskin Ahmed: బస్ మిస్ అయ్యాడు ...వరల్డ్ కప్ ఆడలేకపోయాడు ఇప్పుడేంటి !

Published 2024-07-03 11:30:52

postImages/2024-07-03/1719986452_image982981670325515.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగ్లాదేశ్ ( bangladesh) వైస్ కెప్టెన్ తస్కిన్ అహ్మద్ ( taskin ahmed)  వింత రీజన్ తో టీ 20 వరల్డ్ కప్ కు భారత్ తో జరిగిన సూపర్ -8 మ్యాచ్ ఆడలేదు. వరల్డ్ కప్ ..అందులోను భారత్ లాంటి పెద్ద టీం తో ..ఆడడం ఏ ప్లేయర్ మిస్ చేసుకోడు.అలాంటిది తస్కిన్ మాత్రం మ్యాచ్ జరిగిన రోజు తస్కిన్ తన బస్సు వచ్చినా నిద్రపోయాడట, సమయానికి బస్ మిస్ అయ్యి తుది జట్టులో చోటు కోల్పోయాడు. 


ఆ త‌ర్వాత మ‌రో వాహ‌నంలో స్టేడియానికి వ‌చ్చినా ఫ‌లితం లేకుండా పోయింది. అప్ప‌టికే బంగ్లా జ‌ట్టును ప్ర‌క‌టించారు. ఆయ‌న స్థానంలో మెహ‌దీ హ‌స‌న్‌ను( mehadi hasan)  ఆడించారు. అలాగే ఆ రోజు బంగ్లా జ‌ట్టు కేవ‌లం ఇద్ద‌రు ( paser) పేస‌ర్‌ల‌తోనే బ‌రిలోకి దిగింది. దీనికి తస్కిన్ ఏ రేంజ్ లో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడో తెలియాలి. క్రిక్‌బ‌జ్ నివేదిక ప్ర‌కారం.. బ‌స్సు అందుకోలేక‌పోయినందుకు తోటి ఆట‌గాళ్ల‌తో పాటు అంద‌రికీ తస్కిన్ క్ష‌మాప‌ణ‌లు చెప్పాడు. అతిగా నిద్ర‌పోయి.. స‌మ‌యానికి బ‌స్సు అందుకోలేక‌పోవ‌డంతోనే అత‌డు తుది జ‌ట్టులో ఆడ‌లేద‌ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధికారి ఒక‌రు వెల్ల‌డించారు. 


ఇక బంగ్లాదేశ్ ఇప్పటివరకు ఏ ఐసీసీ ( AICC) ప్రపంచకప్‌లో ( WORLD CUP) సెమీ ఫైనల్‌కు చేర‌కుండానే ఇంటిముఖం ప‌ట్టింది. బంగ్లా కంటే ఇప్పుడిప్పుడే క్రికెట్ ఓన‌మాలు నేర్చుకుంటున్న ఆఫ్ఘ‌నిస్థాన్ ( AFGHANISTAN) ఈసారి ఏకంగా సెమీస్‌కు చేరి అంద‌రీ ప్ర‌శంస‌లు అందుకుంది. కాని బస్ మిస్ అయ్యి వరల్డ్ కప్ ఆడలేకపోవడం మాత్రం రికార్డ్ బ్రేక్ జోక్ అంటున్నారు నెటిజన్లు.