T20 Worldcup: ఆస్ట్రేలియా పై భారత్ గ్రాండ్ విక్టరీ 2024-06-25 00:03:29

సెమీ ఫైనల్ కు టీమిండియా..!

ఆస్ట్రేలియా పై భారత్ గ్రాండ్ విక్టరీ

రోహిత్ శర్మ ఊచ‌కోత

 సూర్య విధ్వంసక ఇన్నింగ్స్ 

అర్షదీప్ సింగ్ టాప్ క్లాస్ బౌలింగ్ 

ఇంగ్లాండ్ తో టీమిండియా ఫైట్

 

న్యూస్ లైన్ స్పోర్ట్స్: టీ20 ప్రపంచకప్ సూపర్ 8లీగ్‌లో భాగంగా సోమవారం డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ ఊచ‌కోత ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. సూర్య కుమార్ యాదవ్ డేంజరస్ బ్యాటింగ్‌ చేశాడు. దాంతో టీమిండియా, ఆసీస్ జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఆదిలోనే ఊహించని షాక్ తగిలింది. వ‌ర‌ల్డ్ క‌ప్‌లో ఓపెన‌ర్‌గా విఫ‌ల‌మ‌వుతున్న విరాట్ కోహ్లీ(0) మ‌ళ్లీ నిరాశ‌ప‌రిచాడు. హేజిల్‌వుడ్ ఓవ‌ర్‌లో బౌండరీ వద్ద టిమ్ డేవిడ్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. త‌ర్వాత రోహిత్ ఆసీస్ బౌలర్లపై రెచ్చిపోయాడు. వ‌రుస‌గా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డును ఉరికించాడు. మ‌రో ఎండ్‌లో రిష‌భ్ పంత్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వీళ్లిద్ద‌రూ భార‌త్ భారీ స్కోర్ బోర్డుకు 50 పరుగులు జోడించారు. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శ‌ర్మ రికార్డు బ‌ద్ధ‌లు కొట్టేశాడు. సెయింట్ లూయిస్‌లో ఆస్ట్రేలియా బౌలర్ల‌కు ఊచ‌కోత చూపిస్తూ హిట్‌మ్యాన్ 19 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ సాధించాడు. ప్యాట్ క‌మిన్స్ వేసిన ఓవ‌ర్లో సిక్స్, ఫోర్ తో రోహిత్ ఫిఫ్టి పూర్తి చేసుకున్నాడు. దాంతో, ఈ సీజ‌న్‌లో వేగ‌వంత‌మైన ఫిఫ్టీ న‌మోదు చేశాడు. రోహిత్ విధ్వంసంతో క్వింట‌న్ డికాక్, అరోన్ జోన్స్ పేరిట ఉన్న రికార్డు బ‌ద్ద‌లైంది. అయితే పంత్(15)ను మార్కస్ స్టోయినిస్ వెనక్కి పంపాడు. దాంతో టీమిండియా రెండు వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో దిగిన సూర్య కుమార్ యాదవ్ దూకుడు బ్యాటింగ్ చేశాడు. కెప్టెన్ రోహిత్‌, సూర్య ఇద్దరు కలిసి ఒక్క కీలక భాగస్వామ్యాని నెలకొల్పారు. 90‘లో చెరిన రోహిత్( 41 బంతుల్లో 92 పరుగులు 7 ఫోర్లు, 8 సిక్సర్లు)ను డేంజరస్ ఆసీస్ బౌలర్ మిచెల్ స్టార్క్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక ఈ సమయంలో బ్యాటింగ్‌కు శివం దూబే దిగాడు. హార్డ్ హిటింగ్ బ్యాటింగ్‌తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే బౌండరీలు, సిక్సర్లు బాదిన సూర్య(31), మిచెల్ బౌలింగ్‌లో పెవిలియన్‌కు చేరాడు. ఆ కాసేపటికే దూబే(28) కూడా ఔటయ్యాడు. ఇక చివరిలో హార్ధిక్ పాండ్యా(27) మెరుపు ఇన్నింగ్స్‌తో టీమిండియా జట్టుకు భారీ స్కోర్‌ను అందించాడు. దాంతో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లు మిచెల్ స్టార్క్, మార్కస్ స్టోయినిస్ చెరో రెండు వికెట్ల పడగొట్టాగా.. హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశాడు.

 

భారీ టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదుకుదెబ్బ తగిలింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్(6), అర్షదీప్ బౌలింగ్ లో భారీ షార్ట్ ఆర్డబోయ్ సూర్యకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులో దిగిన కెప్టెన్ మిచెల్ మార్ష్ ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. మరో ఎండ్ లో ట్రావిస్ హెడ్ భారత బౌలర్ల పై విరుచుకుపడ్డాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ విధ్వంసకర ఇన్నింగ్స్ తో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ ఇద్దరు 80 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే మార్ష్(37)ను కుల్దీప్ యాదవ్ పెవిలియన్ కు పంపాడు. దాంతో ఆసిస్ రెండు వికెట్లు కోల్పోయి 90 రన్స్ కొట్టింది. ఇక హెడ్ నిలకడగా ఆడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ సమయంలో బ్యాటింగ్ కు గ్లెన్ మాక్సవెల్(18), మార్కస్ స్టోయినిస్(2) బ్యాటింగ్ లో విప్లమయ్యారు. కాగా, హెడ్(75), జాస్ప్రిత్ బుమ్రా బౌలింగ్ లో బౌండరీ వద్ద రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ కు చేరాడు. దీంతో ఆస్ట్రేలియా మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. తర్వాత అర్షదీప్ ఒకే ఓవర్లో మాథ్యూ వాడ్(2), టీమ్ డేవిడ్(15) లను వెనక్కి పంపాడు. ఆఖరిలో ప్యాట్ కమ్మిన్స్(11 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. కానీ లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. దాంతో టీమిండియా, ఆస్ట్రేలియా జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. భారత బౌలర్లు అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాగా.. కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు.