Asia Cup: సెమీ ఫైనల్‌లో భారత్ విజయభేరి.!

మ‌హిళ‌ల ఆసియా క‌ప్ సెమీ ఫైన‌ల్‌‌లో రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భార‌త్ గ్రాండ్ విక్టరీ కొట్టింది.


Published Jul 26, 2024 06:15:44 AM
postImages/2024-07-26/1721992493_semifinal.PNG

సెమీ ఫైనల్ భారత్ విజయభేరి
బంగ్లాపై టీమిండియా గ్రాండ్ విక్టరీ
హాఫ్ సెంచరీతో చెలరేగిన మంధన
షఫాలీ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్
రేణుకా సింగ్  రాధా యాద‌వ్


న్యూస్ లైన్ స్పోర్ట్స్:  మ‌హిళ‌ల ఆసియా క‌ప్ సెమీ ఫైన‌ల్‌‌లో రంగి దంబుల్లా అంతర్జాతీయ స్టేడియం వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్‌లో భార‌త్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. టీమిండియా బ్యాటర్లు స్మృతి మంధన హాఫ్ సెంచరీతో చెలరేగగా.. షఫాలీ వర్మ తుఫాన్ బ్యాటింగ్‌తో అదరగొట్టింది. పేస‌ర్ రేణుకా సింగ్(3/10) విజృంభ‌ణ‌తో బంగ్లాదేశ్ టాపార్డ‌ర్ చేతులెసింది. ఆ త‌ర్వాత‌ స్పిన్న‌ర్ రాధా యాద‌వ్(3/14) సైతం మూడు వికెట్ల‌తో స‌త్తా చాట‌డంతో బంగ్లాపై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విక్టరీతో ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.

టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. తొలి ఓవ‌ర్లోనే రేణుకాసింగ్ ఓపెన‌ర్ దిల్హారా అక్త‌ర్‌(6)ను వెనక్కి పంపింది. ఆ త‌ర్వాతి ఓవ‌ర్లో ముర్షిదా ఖాటున్(4), ఇష్మ తంజిమ్‌(8)ల‌ను ఔట్ చేసి బంగ్లాను చావు దెబ్బ కొట్టింది. దాంతో బంగ్లా మూడు వికెట్లు కోల్పోయి  20 రన్స్ చేసింది. ఈ సమయంలో క్రీజులో దిగిన  కెప్టెన్ నిగ‌ర్ సుల్తానా మంచి ఇన్నింగ్స్ ఆడింది. భారత బౌల‌ర్ల‌ను దీటుగా ఎదుర్కొంటూ స్కోర్‌బోర్డును న‌డిపించింది. అయితే.. రాధా యాద‌వ్ బౌలింగ్‌లో భారీ ష్టార్ట్ అడబోయే దీప్తి శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగింది. దాంతో బంగ్లా జట్టు మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. చివరిలో షోమా అక్త‌ర్ మొరుపు బ్యాటింగ్ చేసింది. దాంతో బంగ్లాదేశ్ జట్టు నిర్ణీత ఓవ‌ర్లో 8 వికెట్ల న‌ష్టానికి 88 ప‌రుగుల‌కు ప‌రిమిత‌మైంది.  భారత బౌలర్లు రేణుకా సింగ్, రాధా యాద‌వ్ మూడు వికెట్లతో బంగ్లా బ్యాటర్లపై విరుచుకుపడ్డగా.. పూజా వస్త్రాకర్, దీప్తీ శర్మ చెరో వికెట్ తీశారు.


స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందకు బరిలో దిగిన టీమిండియా జట్టు మంచి ఆరంభం లభించింది. భారత ఓపెనర్లు స్మృతి మంధన, షఫాలీ వర్మ ఇద్దరూ దూకుడు బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఇక మంధన బంగ్లా బౌలర్లపై విరుచుకుపడ్డింది. బౌండరీలు, సిక్సర్లు బాదుతూ ఊచకోత చూపించింది. దాంతో స్మృతి ( 39 బంతుల్లో 55 పరుగులు 9 ఫోర్లు, 1 సిక్సర్) సహయంతో అర్థ సెంచరీ పూర్తి చేసింది. మరో ఎండ్‌లో షఫాలీ వర్మకు కూడా విధ్వంసకర బ్యాటింగ్ చేసింది. బంగ్లా బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ ధనాధన ఇన్నింగ్స్‌తో చెలరేగారు. దాంతో వీళ్లిందరూ 11 ఓవర్లలోనే టార్గెట్‌ను ఛేదించారు. బంగ్లాదేశ్ జట్టుపై 10 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ గ్రాండ్ విక్టరీతో భారత్ ఆసియా కప్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. 
 

newsline-whatsapp-channel
Tags : telangana india-women won-the-match india semi-final

Related Articles