T20 Match: సఫారీపై టీమిండియా విక్టరీ..!

సొంత గడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో టీ20 పోరులో భారత్ మహళ జట్టు ఘన విజయం సాధించింది.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-09/1720541029_team.jfif

సఫారీపై టీమిండియా విక్టరీ
హాఫ్ సెంచరీతో చెలరేగిన మంధన
షఫాలీ వర్మ ధనాధన్ బ్యాటింగ్
పూజా, రధ బౌలింగ్ షో

న్యూస్ లైన్ స్పోర్ట్స్:  సొంత గడ్డపై సౌతాఫ్రికాతో ఐదు టీ20 మ్యాచ్ సిరీస్‌లో భాగంగా మంగళవారం చెపాక్ వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మూడో టీ20 పోరులో భారత్ మహళ జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా బ్యాటర్స్ స‌్మృతి మంధన అర్థ సెంచరీతో విధ్వంస చేయగా.. షఫాలీ వర్మ ధనాధన ఇన్నింగ్స్‌తో సఫారీ బౌలర్లకు చుక్కలు చూపించింది. దాంతో దక్షిణాఫ్రికా, టీమిండియా జట్టుపై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది.  

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా మహళ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్(9), శ్రేయాంక పాటిల్ ఓవర్‌లో పెవిలియన్‌కు చేరింది. ఆ తర్వాత క్రీజులో దిగిన మారిజాన్ కాప్ మంచి బ్యాటింగ్ చేసింది. తజ్మిన్ బ్రిట్స్, కాప్ ఇద్దరు ధనాధన్ బ్యాటింగ్ చేస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ జోడి సఫారీ బోర్డుకు 30 రన్స్ జతచేశారు. అయితే కాప్‌(10)ను పూజా వస్త్రాకర్ వెనక్కి పంపాగా.. తజ్మిన్ బ్రిట్స్(20), దీప్తి శర్మ ఓవర్‌లో బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చి ఔటయ్యింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన న్నెకె బొస్చ్‌ కీలక ఇన్నింగ్స్ ఆడింది. కానీ పూజా వస్త్రాకర్, బోస్చ్(17)ను ఎల్బీగా ఔట్ చేసింది. ఆ కాసేపటీకే న‌డినె డి క్లెర్క్(0)ను కూడా క్లీన్ బౌల్డ్ చేసింది. దాంతో సౌతాఫ్రికా ఐదు వికెట్లు కోల్పోయి 60 పరుగులు చేసింది. తర్వాత క్రీజులో బ్యాటింగ్‌కు దిగిన కొలె ట్ర‌యాన్(98), అన్నెరీ డెర్క్‌సెన్(2), నొనుకెలెలెకొ ల‌బా(0)లు పేళవ బ్యాటింగ్ ప్రదర్శనతో నిరాశ పరిచారు. ఇక అఖరిలో సినాలో జ‌ఫ్తా(8), ఎలిజ్-మారీ మార్క్స్(7) మంచి క్యామియో ఇన్నింగ్స్ ఆడారు. దాంతో సౌతాఫ్రికా 17.1 ఓవర్లలో 84 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లు పూజా వస్త్రాకర్ నాగులు వికెట్లతో విజ్రంభించగా.. రధ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టింది.  


స్వల్ప టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలో దిగిన టీమిండియా జట్టుకు ఓపెనర్లు మంచి ఆరంభం అందించారు. షఫాలీ వర్మ, స్మృతి మంధన దూకుడు బ్యాటింగ్ చేస్తూ చెపాక్ స్టేడియంలో పరుగుల వరద పారించారు.  వేగంగా బౌండరీలు, సిక్సర్లు బాదుతూ స్కోర్ బోర్డను ముందుకు నడిపంచారు. ఇక మంధన హార్డ్ హిటింగ్ బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లకు చుక్కులు చూపించింది. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్మృతి( 38 బంతుల్లో 54 పరుగులు 9 ఫోర్లు, 1 సిక్సర్) సహాయంతో హాఫ్ సెంచరీ పూర్తి చేసింది. వీళ్లద్దరు కలిసి భారత స్కోర్ బోర్డుకు 88 రన్స్ జోడించారు. ఇక మంధన(54 నటౌట్), షఫాలీ(27 నటౌట్) కలిస 10.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు.  దాంతో టీమిండియా మహళ జట్టు, దక్షిణాఫ్రికాపై 10 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఈ సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-0 తేడాతో కొనసాగుతోంది. 

newsline-whatsapp-channel
Tags : south-africa won-the-match india

Related Articles