Bowlers: టెస్టుల్లో టాప్ -5 బౌలర్లు వీరే

శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా చరిత్ర సృష్ట్రించాడు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-18/1721315619_top5.PNG

న్యూస్ లైన్ డెస్క్: శ్రీలంక స్టార్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక వికెట్లు తీసుకున్న బౌల‌ర్‌గా చరిత్ర సృష్ట్రించాడు. లంక తరఫున 133 టెస్టు ఆడి ముత్తయ్య 800 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే  క్రికెట్‌లో ఇప్ప‌టివ‌ర‌కు 800 వికెట్లు సాధించిన ఒకేఒక్క బౌల‌ర్ ముత్త‌య్య‌ మురళీధరన్ రికార్డు నమోదు చేశాడు. 2007లో షేన్ వార్న్‌ను అధిగమించి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

క్రికెట్ చరిత్రలో టాప్-5 బౌలర్ల వివరాలు:

షేన్ వార్న్: ఆస్ట్రేలియా క్రికెట్ లెజెండరీ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ 145 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లతో రెండో స్థానంలో నిలిచాడు. అయితే ముత్తయ్య రికార్డును వార్న్ బద్దలు కొట్టలేకపోయాడు. వార్నర్ 2007లో టెస్టు క్రికెట్ నుంచి వీడ్కోలు పలికాడు. కాగా, ఓ కారు యాక్సిడెంట్ ప్రమాదంలో మరణించాడు.

జేమ్స్ ఆండర్సన్: ఇంగ్లాండ్ స్టార్ బౌల‌ర్ తన క్రికెట్ చరిత్రలో అత్య‌ధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌల‌ర్ నిలిచాడు. మొత్తంగా టెస్టు మ్యాచ్‌ల్లో 704 వికెట్లు తీసుకుని టాప్-5లో మూడో స్థానంలో ఉన్నాడు.

అనిల్ కుంబ్లే: భారత దిగ్గజ లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే తన ఖాతాలో 619 వికెట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ లెజెండ‌రీ ఆటగాడు టీమిండియా తరఫున 132 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 2008లో కుంబ్లే తన చివరి టెస్టు ఆస్టేలియాతో ఆడాడు.

స్టువర్ట్ బ్రాడ్: ఇంగ్లాండ్ యువ మీడియం-ఫాస్ట్ బౌలర్ బ్రాడ్ టెస్టుల్లో 604 వికెట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. 2023లో టెస్టు క్రికెట్‌కు బ్రాడ్ గుడ్ బై చేప్పేశాడు. ఇంగ్లాండ్ తరఫున 167 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 

newsline-whatsapp-channel
Tags : telangana india

Related Articles