ఈ నెల 30, 31 రెండు రోజుల పాటు నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. పటాన్ చెరులోని జంక్షన్ లో మరమ్మత్తుల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు.
న్యూస్ లైన్ డెస్క్ : జీహెచ్ఎంసీ పరిధిలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపివేయనున్నట్టు వాటర్ బోర్డు ప్రకటించింది. ఈ నెల 30, 31 రెండు రోజుల పాటు నగరంలో తాగునీటి సరఫరా నిలిపివేయనున్నట్టు అధికారులు తెలిపారు. పటాన్ చెరులోని జంక్షన్ లో మరమ్మత్తుల కారణంగా జీహెచ్ఎంసీ పరిధిలోని మంజీరా నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వెల్లడించారు. కొన్ని ప్రాంతాలకు పూర్తిగా, మరికొన్ని ప్రాంతాలకు పాక్షికంగా తాగునీటి సరఫరా నిలిపివేయనున్నారు. 30వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 31వ తేదీ ఉదయం 6 గంటల వరకు తాగునీటి సప్లై ఉండదు.
బీహెచ్ఈఎల్ టౌన్ షిప్, హెచ్.సీయూ, పటాన్ చెరు ఇండస్ట్రీయల్ ఏరియా, పటాన్ చెరు పట్టణం, రామచంద్రాపురం, అశోక్ నగర్, జ్యోతి నగర్, లింగంపల్లి, చందానగర్, గాంరం, మదీనాగూడ, హఫీజ్ పేట, డోయెన్స్ కాలనీ, ఎస్బీఐ ట్రైనింగ్ సెంటర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాకు అంతరాయం కలుగుతుందని వాటర్ బోర్డు అధికారులు తెలిపారు. పైప్ లైన్ మరమ్మత్తుల కారణంగా నీటి సప్లైకి ఇబ్బంది కలిగిందని ప్రజలు అంతరాయానికి సహకరించాలని హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు కోరింది. నీటి సరఫరా నిలిచిపోనున్నా నేపథ్యంలో రెండు రోజుల పాటు నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.