Vivo V50 Launch : సూపర్ ఫీచర్స్ తో వివో V50 స్మార్ట్ ఫోన్ !

ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటిలోనూ 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలదు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 


Published Feb 17, 2025 05:18:00 PM
postImages/2025-02-17/1739792994_vivov50vivo1738818174388.webp

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: వివో ఇండియా వివో V50 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. వివో లేటెస్ట్ కెమెరా-ఫోకస్డ్ స్మార్ట్‌ఫోన్ వివో V50 లాంచ్ చేసింది. ఈ ఫోన్ 6,000mAh బ్యాటరీ, ఇన్-డిస్‌ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, క్వాడ్ కర్వ్డ్ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. వన్‌ప్లస్ 13Rలకు పోటీగా మార్కెట్లోకి వచ్చింది. ఈ ఫోన్ 1.5 మీటర్ల నీటిలోనూ 30 నిమిషాల పాటు మునిగినా తట్టుకోగలదు. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 


50ఎంపీ వైడ్-యాంగిల్ లెన్స్‌తో డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50ఎంపీ షూటర్ ఉంది. 4 ఏళ్ల సెక్యూరిటీ ప్యాచ్‌లను అందిస్తుంది.  వివో V50 ఫోన్ 8GB RAM/128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 34,999కు ఆఫర్ చేస్తోంది. 8GB RAM/256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 36,999కు అందుబాటులో ఉంది.  ఫిబ్రవరి 25 నుంచి ఫ్లిప్‌కార్ట్ , అమెజాన్, వివో ఇండియా వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌పై ప్రీ-బుకింగ్ ఆర్డర్లు ఫిబ్రవరి 17 నుంచే ప్రారంభమయ్యాయి. మీరు కూడా ఈ ఫోన్ కావాలంటే ఇప్పుడే ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu india mobile-phone

Related Articles