బీవైడీ 2024లో 777.1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.9.15 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. చైనా ఆదాయానికి దాదాపు 8.30 లక్షల కోట్ల ఆదాయం ఈ బ్రాండ్ కార్ల వల్ల కలిగిందంటే ఆశ్చర్యపోతున్నారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఇప్పుడు అన్ని దేశాల్లోను ఎలక్ట్రిక్ కార్లు సూపర్ గా రన్ అవుతున్నాయి. జనాలకు ఎలక్ట్రిక్ కార్స్ పై అవగాహన పెరిగింది.చైనాకు చెందిన కార్ల తయారీ సంస్థ బీవైడీ గత సంవత్సరం గణనీయమైన ఆదాయాన్ని ఆర్జించింది. స్టాక్ ఫైలింగ్ ద్వారా వెల్లడైన వివరాల ప్రకారం, బీవైడీ 2024లో 777.1 బిలియన్ యువాన్ల (సుమారు రూ.9.15 లక్షల కోట్లు) ఆదాయాన్ని నమోదు చేసింది. చైనా ఆదాయానికి దాదాపు 8.30 లక్షల కోట్ల ఆదాయం ఈ బ్రాండ్ కార్ల వల్ల కలిగిందంటే ఆశ్చర్యపోతున్నారు.
చైనా ఎలక్ట్రిక్ వాహన మార్కెట్‌లో బీవైడీ అగ్రగామిగా నిలిచింది. 2023తో పోలిస్తే 29 శాతం వృధ్ధిని సాధించింది. బ్లూమ్ బెర్గ్ అంచనా వేసిన 766 బిలియన్ యువాన్ల కంటే ఇది చాలా ఎక్కువ . బీవైడీ నికర లాభం రికార్డు స్థాయిలో 40.3 బిలియన్ యువాన్లకు చేరుకుంది. ఇది 2023 నుంచి చూస్తే 34 శాతం అధికం.
బీవైడీ ఇటీవల కొత్త బ్యాటరీ సాంకేతికతను ఆవిష్కరించింది. దీని ద్వారా కేవలం ఐదు నిమిషాలు ఛార్జ్ చేస్తే 470 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఇవే వాళ్లకి పెద్ద ప్రమోషన్. బీవైడీ తాజా బ్యాటరీ ఛార్జింగ్ సిస్టమ్ 1,000 kw సామర్ధ్యంతో ఛార్జ్ చేయగలదని పేర్కొంది. ఇది టెస్లా యొక్క సూపర్ ఛార్జర్ల కంటే వేగవంతమైనది .