ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా మారిందని వివరించారు. ఏఐతో ట్విట్టర్ మరింత బాగా డవలప్ అవుతుందని తెలిపారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ ను అమ్మేసినట్లు ప్రకటించారు. 33 మిలియన్ డాలర్లకు ఎక్స్ ను అమ్మేసినట్లు మస్క్ తెలిపారు. అయితే మస్క్ నేతృత్వంలోని కృత్రిమ మేధ (AI) అంకుర సంస్థ ఎక్స్‌ఏఐ (xAI)కే దీనిని విక్రయించారు. ఈ విషయాన్ని మస్క్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఎక్స్‌ఏఐ విలువను 80 బిలియన్ డాలర్లుగా మారిందని వివరించారు. ఏఐతో ట్విట్టర్ మరింత బాగా డవలప్ అవుతుందని తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఉన్న మస్క్, టెస్లా, స్పేస్‌ఎక్స్ సీఈవోగానూ కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2022లో ట్విటర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు మస్క్. ఎక్స్ ఏఐ కలిసి ప్రొగ్రామింగ్ లో దారుణమైన మార్పులు సంభవిస్తాయని తెలిపారు.
అంతేకాకుండా గతేడాది చాట్‌జీపీటీకి పోటీగా ఎక్స్‌ఏఐ పేరుతో అంకుర సంస్థను ప్రారంభించారు మస్క్. ఎక్స్‌ఏఐ, ఎక్స్ భవిష్యత్‌లు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని, డేటా మోడల్స్‌ను అనుసంధానం చేయడం ద్వారా మరిన్ని ఉత్తమ ఫలితాలు రాబట్టేందుకు ముందడుగు వేస్తున్నామన్నారు.