Jio: IPL కోసం జియో గుడ్ న్యూస్ ...కస్టమర్లకు బంపర్ ఆఫర్ !

ఇన్నాళ్లు ఉచితంగా వీక్షించిన ఫ్యాన్స్ కు హాట్ స్టార్ తో విలీనం రూపంలో జియో షాకిచ్చింది. మ్యాచ్ ను చూడాలంటే కస్టమర్స్ కు మినిమమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే షరతు పెట్టింది.


Published Mar 17, 2025 02:21:00 PM
postImages/2025-03-17/1742208570_ipljio12001741772418.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: మరో ఐదురోజుల్లో ఇండియన్ ప్రీమియం లీగ్ ( ఐపీఎల్ ) మొదలవుతుంది. ఈ నెల 22నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది. క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఈ మెగా ఈవెంట్ ను డిజిటల్ వేదికగా జియో ప్రసారం చేయనున్న విషయం అందరికి తెలిసిందే. అయితే ఇన్నాళ్లు ఉచితంగా వీక్షించిన ఫ్యాన్స్ కు హాట్ స్టార్ తో విలీనం రూపంలో జియో షాకిచ్చింది. మ్యాచ్ ను చూడాలంటే కస్టమర్స్ కు మినిమమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలనే షరతు పెట్టింది.


తాజాగా త‌న వినియోగ‌దారుల‌కు జియో తీపి క‌బురు చెప్పింది. కొన్ని రీఛార్జ్ ప్లాన్స్ పై జియో యూజర్లు 90 రోజుల పాటు ఉచితంగా జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చని వెల్లడించింది. వినియోగదారులు రూ. 299అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్ స్టార్ సబ్ స్క్రిప్షన్ ను పొందవచ్చని వెల్లడించింది. కస్టమర్లు రూ.299 అంతకంటే ఎక్కువ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే జియో హాట్ స్టార్ సబ్ స్రిప్షన్ ను ఫ్రీ గా పొందవచ్చు. దీంతో క్రికెట్  ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ ఫీలవుతున్నారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu cricket-news jio

Related Articles