కావాలనే కవితకు బెయిల్ మంజూరు చేయకుండా విచారణలో జాప్యం చేస్తున్నారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించారు. కవిత తరచూ ఫోన్లు మారుస్తూ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందన్న ఈడీ, సీఐడీ తరపు న్యాయవాది ఆరోపణలపై కవిత తరపు న్యాయవాది మండిపడ్డారు. ఫోన్లు మార్చడం కేసుతో సంబంధం లేని విషయమని వాదించారు.
న్యూస్ లైన్ డెస్క్ : మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో కావాలనే కవితకు బెయిల్ మంజూరు చేయకుండా విచారణలో జాప్యం చేస్తున్నారని కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహిత్గీ సుప్రీంకోర్టు ముందు తన వాదనలు వినిపించారు. కవిత తరచూ ఫోన్లు మారుస్తూ కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేసిందన్న ఈడీ, సీఐడీ తరపు న్యాయవాది ఆరోపణలపై కవిత తరపు న్యాయవాది మండిపడ్డారు. ఫోన్లు మార్చడం కేసుతో సంబంధం లేని విషయమని వాదించారు. ఇప్పటి వరకు 450 మందికి పైగా సాక్ష్యులను విచారించారని.. అయినా కేసు ఎందుకు ముదుకు సాగడం లేదో గమనించాలని రోహిత్గీ సుప్రీంకోర్టును కోరారు.
మనీష్ సిసోడియాకు వర్తించిన నిబంధనలే.. కవితకు కూడా వర్తిస్తాయని.. ఆ నిబంధనల ఆధారంగానే కవితకు బెయిల్ మంజూరు చేయాలని రోహిత్గీ అత్యున్నత న్యాయస్థానాన్ని కోరారు. కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలు, సాక్ష్యులను కవిత తారుమారు చేస్తున్నారని ఈడీ తరపు న్యాయవాది ఎస్వీ రాజు కోర్టు ముందు ఆరోపించారు. ఆమె సాక్ష్యాలు, ఆధారాలు మాయం చేస్తున్నారని అందుకే కేసు విచారణలో జాప్యం జరుగుతుందని.. సమగ్ర విచారణ కోసం సమయం తీసుకుంటున్నామని న్యాయవాది ఎస్వీ రాజు అన్నారు.