రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి . దీనికి సంబంధించిన ప్రొమో వీడియోను చైనాకు చెందిన టెక్ సంస్థ యూనిట్రీ విడుదల చేసింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఏఐ వచ్చాక ఏదైనా సాధ్యమే . టెక్నాలజీ ద్వారా సాధ్యమైన కొన్ని ఘనతల్లో రోబోలు కూడా ఒకటి. ఇప్పుడీ మరమనుషులు దాదాపు అన్ని పనులు చేస్తున్నారు. రీసెంట్ గా చైనాలో రోబోల మధ్య బాక్సింగ్ బౌట్ నిర్వహించారు. జీ1, హెచ్ 1 అనే రెండు హ్యూమనాయిడ్ రొబోలను బాక్సింగ్ రింగ్ లోకి దించారు. రోబోల మధ్య బాక్సింగ్ పోటీ నిర్వహించడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి . దీనికి సంబంధించిన ప్రొమో వీడియోను చైనాకు చెందిన టెక్ సంస్థ యూనిట్రీ విడుదల చేసింది.
జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా... హెచ్1 రోబో ఎత్తు 5.11 అడుగులు. అయితే, ఈ రోబోలు పంచ్ లు, కిక్ లు విసురుతున్నా వాటిలో పవర్ లేకపోవడంతో ఈ బౌట్ నిస్సారంగా సాగింది. విరామం లేకుండా స్పారింగ్ చేయడం మాత్రం ఆకట్టుకుంది.
Unitree Iron Fist King: Awakening!
![]()
Tags : news-line newslinetelugu viral viral-video china robo- robo-van