అది గుండె,జెనెటిక్ వంటి ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు. ఇలా ఏవైనా చాలా రేర్ కేసులు ..ఏదైనా ఇబ్బందులు పడుతుంటే మాత్రం నిమ్స్ లో ఉచిత వైద్యం చేస్తున్నారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రస్తుత కాలంలో ఏ జబ్బులు ఎలా వస్తున్నాయో తెలీదు. వయసుతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరు ఆరోగ్యానికి సరైన ప్లాన్ చేసుకోవల్సిందే. తిండి వలనో...వాతావరణమో తెలీదు కాని అరుదైన వ్యాధుల బారినపడిన వారిలో.. ఎక్కువ శాతం చిన్నారులే ఉండటం గమనర్హం. చాలామంది చిన్నారుల పుట్టుకతోనే అరుదైన వైద్యుల బారిన పడుతుంటారు. అది గుండె,జెనెటిక్ వంటి ఏ ఇతర అనారోగ్య సమస్యలు కావొచ్చు. ఇలా ఏవైనా చాలా రేర్ కేసులు ..ఏదైనా ఇబ్బందులు పడుతుంటే మాత్రం నిమ్స్ లో ఉచిత వైద్యం చేస్తున్నారు.
చిన్నారుల్లో ఎవ్వరు వైద్యం అందక చనిపోకూడదు. హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రి రూ. 50 లక్షల ఖరీదైన ఉచిత వైద్యం అందించనున్నట్లు ప్రకటించారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజ్ (NPRD) అనే పాలసీని ఇప్పుడు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో కూడా అమలు చేస్తున్నారు. దీని కోసం జెనిటికల్ డిసర్డర్స్ కాని ..అరుదైన వ్యాధులు కాని చిన్నారుల్లో కనిపిస్తే వీటి కోసం ప్రత్యేకమైన సదుపాయాలు ..ప్రత్యేకమైన డాక్టర్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఒక్కో చిన్నారి చికిత్సకు రూ.50 లక్షలను సెంటర్ ఫర్ హెల్త్ మినిస్ట్రీ నుంచి నిధులు కేటాయిస్తారని ఆయన చెప్పారు. దాంతో బాధిత చిన్నారులకు ఉచితంగా చికిత్స అందించనున్నట్లు వెల్లడించారు. మీకు మీ పిల్లల డాక్టర్ ఏ మాత్రం చిన్న అనుమానం వ్యక్తం చేసినా వెంటనే పిల్లల్ని టైం వేస్ట్ చేయకుండా నిమ్స్ కు తీసుకువస్తే ఆలస్యం కాకుండానే వైద్యం అందిస్తామని డాక్టర్లు చెబుతున్నారు.