ఆ దంపతులు తల్లితండ్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో అక్టోబర్ 8, 9 తేదీల్లో శుక్లపక్ష షష్టితిథి వచ్చింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఈ రోజే స్కంధ షష్ఠి . సంతానం కోసం వేచి ఉండేవారికి ఈ స్కంధ షష్ఠి వ్రతం ఓ వరం. ప్రతి నెల శుక్లపక్షం షష్ఠి తిథి రోజున స్కంధ షష్ఠి వ్రతం చేస్తే ఆ దంపతులు తల్లితండ్రులు అవుతారని పురాణాలు చెబుతున్నాయి. అక్టోబర్ 8, 9 తేదీల్లో శుక్లపక్ష షష్టితిథి వచ్చింది.
సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈ రోజున స్కంద షష్టి వత్రం చేస్తే తప్పకుండా పిల్లలు జన్మిస్తారని నమ్మకం.దంపతులు అన్యోన్యంగా ఉండడానికి కూడా ఈ వ్రతం చేస్తారు. అయితే మంగళవారం ఉదయం 11.17 నిమిషాల నుంచి అక్టోబర్ 9 బుధవారం మధ్యాహ్నం 12.34 నిమిషాల వరకు షష్ఠి వ్రతం చేసుకోవచ్చు. అయితే ఈ వ్రతానికి ఉపవాస దీక్ష కంపల్సరీ . అయితే తిథి ప్రకారం స్కంద షష్ఠి ఉపవాసం అక్టోబర్ 9 వ తేదీన మాత్రమే ఆచరించాల్సి ఉంటుంది. షష్టి ఉపవాసం మరుసటి రోజు అంటే అక్టోబర్ 10వ తేదీన విరమించాల్సి ఉంటుంది.
స్కంద షష్టి రోజున పొద్దున్నే నిద్ర లేచి అభ్యంగస్నానం ఆచరించాలి. ఉతికిన బట్టలు ధరించాలి. ఇక పూజా మందిరాన్ని శుభ్రం చేసి, కార్తికేయ విగ్రహాన్ని ప్రతిష్టించాలి. స్వామి వారిని పూలు , సుగంధ ద్రవ్యార్చనతో పూజించాలి.కార్తికేయుడిని ధ్యానిస్తూ మంత్రాలను జపించండి. కార్తికేయుడిని పూజించిన తర్వాత.. కార్తికేయుని జన్మ రహస్యం కథను వినండి లేదా చదవండి. ఎవరికైనా కష్టంలో ఉన్నవారికి సాయం చెయ్యండి. అదీ కుదరకపోతే ఏదైనా ఎవరికైనా తినడానికి భోజనం పెట్టండి. లేదంటే కుక్కకు కాసింత భోజనం పెట్టండి. మనసుంటే దారి దొరుకుతుంది.
తమ పిల్లల దీర్ఘాయువు కోసం ఉపవాసాన్ని పాటిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా కార్తికేయ భగవానుడితో పాటు శివపార్వతుల అనుగ్రహాన్ని పొందుతారు. స్వామి వారి అనుగ్రహం ఉంటే ఎవరైనా సంతానాన్ని పొందగలరు.
జపించాల్సిన మంత్రం..
మంత్రం: దేవ సేనాపతే స్కంద కార్తికేయ భవోద్భవ|
కుమార గ్రుహ్ గాంగేయ శక్తి హస్తా నమోస్తుతే !