Kolkata : కలకత్తా ఘటనపై రేపు సుప్రీంకోర్టులో విచారణ


Published Aug 19, 2024 03:32:02 PM
postImages/2024-08-19/1724061722_kolkata.jpg

న్యూస్ లైన్ డెస్క్ :    కలకత్తా జూనియర్ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం, హత్యతో బెంగాల్ అట్టుడుకుతోంది. దేశ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. మెడికల్ స్టూడెంట్ కుటుంబానికి న్యాయం చేయాలని ప్లకార్డులు, పోస్టర్లు, క్యాండిల్ ర్యాలీలు జరుగుతున్నాయి. 11 రోజులుగా దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలు దేశంలో డాక్టర్ల భద్రతకు ప్రత్యేక రక్షణ చట్టం తేవాలని డిమాండ్ తెరపైకి వచ్చింది. ఢిల్లీలో వైద్య విద్యార్థులు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యాలయం ముందు ఆందోలనచేపట్టారు. ఈ ఘటనలో విచారణ వేగవంతం కాకపోవడం పట్ల ఆప్ ఎంపీ హర్జజన్ సింగ్ రాసిన లేఖపై బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ స్పందించారు. వెంటనే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయాలని, బాధితరాలి కుటుంబానికి న్యాయం చేయాలని రాజ్ భవన్ కార్యాలయాన్ని ఆదేశించారు.

బెంగాల్లోని దీదీ సర్కార్ పై గవర్నర్ ఆనంద్ బోస్ మండిపడ్డారు. ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో బెంగాల్ ప్రభుత్వం విఫలమైందని ఆయన ఫైర్ అయ్యారు. కాగా.. ఆర్జీ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ దత్ ను సీబీఐ నాలుగో రోజు విచారించింది. ఘటనకు ముందు, తర్వాత ఆయన చేసిన ఫోన్ కాల్స్ పై ప్రశ్నించారు.  ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న సుప్రీంకోర్టు మంగళవారం కేసు విచారించనుంది. జస్టిస్ చంద్రచూడ్ ధర్మాసనం ఘటనపై బెంగాల్ ప్రభుత్వాన్ని విచారించనుంది. ఈ ఉదంతంపై పద్మ అవార్డులు పొందిన 70మంది ప్రధానికి లేఖ రాశారు.

newsline-whatsapp-channel
Tags : doctors delhi national bengalcm mamathabenarjee westbengal

Related Articles