నోటితో పట్టుకుని బలంగా లాగింది. పులి బలం ముందు మన తాళాలు..గోడలు ఎంత చెప్పండి.దర్జాగా తలుపుతెరుచుకొని పులిలా బయటకు వచ్చింది ఓ సారి పులే కదా...అయినా పులిలాగే బయటకు వచ్చింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బోనులో ఉండడం ఎవరికైనా కష్టమే. కాళ్లు కట్టేసి ..ఈ బోనులోనే తిరుగు అంటే ఎలా ..పాపం అందుకే ఇక ఎవ్వరు నన్ను ఆపలేరనుకుందో..లేదా ఏంది బ్రో ఈ కష్టాలు ..సత్తే ఒక్కసారే సత్తాం అని అనుకుందో తాళం పగలగొట్టుకొని బయటకు వచ్చేసింది ఓ పులి. ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది.తాళం కప్పను నోటితో పట్టుకుని లాగుతూ దానిని పగలగొట్టేందుకు పులి ప్రయత్నించింది. ఆ తర్వాత కాలితో బోను తలుపును లాగేందుకు ప్రయత్నించింది. రాకపోవడంతో మరోమారు తాళంకప్పను నోటితో పట్టుకుని బలంగా లాగింది. పులి బలం ముందు మన తాళాలు..గోడలు ఎంత చెప్పండి.దర్జాగా తలుపుతెరుచుకొని పులిలా బయటకు వచ్చింది ఓ సారి పులే కదా...అయినా పులిలాగే బయటకు వచ్చింది.
ఇప్పుడు ఈ వీడియో ఫుల్ వైరల్ అవుతుంది. నిజానికి ఆ వీడియోను అధికారులు సోషల్ మీడియా నుంచి తొలగించారు. మరి వాళ్ల ఉద్యోగాలకు ఏం ఇబ్బందో తెలీదు కాని వీడియో డిలీట్ చేసేశారు. విషయం తెలిసిన వాళ్లు చాలా ఆశ్చర్యపోతున్నారు. పులి బోనులో ఉందని వెథవ వేషాలు వేస్తే ..ఇక పై ఊరుకోదు.. జాగ్రత్తలు తీసుకోవల్సిందే అని కొందరు.లేదు లేదు ..ప్రకృతి చాలా బలమైనది. మనమే తక్కువగా అంచనావేస్తున్నామని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.
బంధిస్తే ఎవరైనా అంతే అంటున్నారు మరికొందరు. బలమైన వాడిని కాళ్లు కట్టేస్తే ఊరుకుంటాడా ...అదే జరిగింది. తప్పులేదు...ఇంకా ఎవరి చంపలేదు సంతోషించండి. ఇక నైనా అడవులో జంతువులను స్వేఛ్ఛగా తిరగనివ్వండి అంటూ కామెంట్లు పెడుతున్నారు.