మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమైన టీటీడీ ఈవో రాగల 36 గంటల్లో కురిసే వర్షాలపై చర్చించారు. దీంతో తిరుమలలో బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం తిరుమలకు వెళ్లే భక్తులపై కూడా పడింది. వచ్చే మూడు రోజుల్లో కోస్తా , రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం సిబ్బందితో సమావేశమైన టీటీడీ ఈవో రాగల 36 గంటల్లో కురిసే వర్షాలపై చర్చించారు. దీంతో తిరుమలలో బ్రేక్ దర్శనాలు సిఫార్సు లేఖలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
16న వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది. భక్తుల భద్రత దృష్ట్యా బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్యామలరావు వెల్లడించారు. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో కుండపోతగా వానలు పడుతున్నాయి. సముద్ర తీరాలు దారుణంగా ఎగిసిపడుతున్నాయి.వీటితో పాటు భారీవర్షాలు కురిస్తే కొండ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమావేశంలో సిబ్బందికి ఈవో పలు సూచనలు చేశారు.
తిరుమలలో రెండురోజుల క్రితమే శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా ముగిశాయి. సుమారు 8 రోజులపాటు స్వామి వారి బ్రహ్మోత్సవాలు జరిగాయి. దాదాపు 18 లక్షల మంది స్వామి వారి దర్శనం చేసుకున్నారు.