పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: రంగారెడ్డి(rangareddy) జిల్లా శంషాబాద్(shamshabad)లో ఆదివారం చిరుత కలకలం రేపుతోంది. ఝాన్సీమియాగూడ(ghansimiyaguda) శివారులో చిరుత సంచరిస్తున్నట్లు గ్రామస్థులు తెలిపారు. పొలంలో కుక్కలపై దాడి చిరుత(cheetah) దాడి చేసిందని వెల్లడించారు. చిరుత సంచారం కారణంగా కంటిమీద లేకుండా పోయిందని వాపోతున్నారు.పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.
పంట పొలాల్లో చిరుత తిరుగుతుందని చెప్పినా అధికారులు స్పందించడం లేదని రైతులు వాపోతున్నారు. చిరుతను పట్టుకోవడానికి బోను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చిరుతను బందించాలని కోరుతున్నారు. చిరుత భయం వల్ల రాత్రి పగలు తేడా లేకుండా కాపలాకాయాల్సి వస్తుందని రైతులు, స్థానికులు చెబుతున్నారు.