సురేష్ షెట్కర్, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు.
న్యూస్ లైన్ డెస్క్: ఎంపీలుగా ఎన్నికైన సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీ(Delhi)లోని లోక్‌సభలో తెలంగాణ(telangana) నుండి ఎన్నికైన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. ఆదిలాబాద్ బీజేపీ ఎంపీ గోడెం నగేష్ హిందీలో ప్రమాణం చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఇంగ్లీష్(English)లో ప్రమాణ స్వీకారం చేశారు.
జహీరాబాద్ కాంగ్రెస్ ఎంపీ సురేష్ షెట్కర్, మల్కాజ్‌గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ, నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, నల్గొండ కాంగ్రెస్ ఎంపీ కుందూరు రఘవీర్ రెడ్డి, భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య, మహబూబాబాద్ కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ తెలుగు(Telegu)లో ప్రమాణస్వీకారం చేయగా.. హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ హిందీ(Hindi)లో ప్రమాణం చేశారు.
సురేష్ షెట్కర్, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు.
కాగా, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తన ప్రమాణస్వీకారం తర్వాత చేసిన నినాదం వివాదాస్పదమైంది. ప్రమాణస్వీకారం చివరిలో జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అని అన్నారు. దీంతో బీజేపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. రికార్డ్స్ నుంచి ఓవైసీ వ్యాఖ్యలను తొలిగించాలని స్పీకర్ ఓం బిర్లాను కోరారు. దీనిపై స్పందించిన స్పీకర్ తొలగిస్తానని హామీ ఇచ్చారు.