Srisailam: శ్రీశైలం మల్లన్నకు కానుకల ద్వారా భారీ ఆదాయం

శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి హుండీ కానుకల ద్వారా  రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.


Published Oct 25, 2024 12:10:00 PM
postImages/2024-10-25/1729838472_srisailamcbb636dba6.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డ్రెస్ : శ్రీశైలం భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి ఆలయానికి హుండీ కానుకల ద్వారా  రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది.  అంతేకాదు చంద్రావతి కళ్యాణ మండపంలో గురువారం ఆలయం అధికారులు వారి సిబ్బందితో ఆలయ హుండీ లెక్కింపులు జరిపారు. ఈ కానుకుల రూపంలో స్వామి వారికి రెండున్నర కోట్ల రూపాయిలు వచ్చినట్లు ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు.


 దీని తో పాటు 379 గ్రాముల బంగారు అభరణాలు, సుమారు 8.80 కేజీల వెండి ఆభరణాలు కూడా కానుకలుగా వచ్చాయన్నారు. వీటితో పాటు పెద్ద ఎత్తున విదేశీ కరెన్సీ కూడా కానుకలుగా వచ్చాయని ఆయన తెలిపారు.  వాటిలో యూఎన్ఏ డాలర్లు 1093, కెనడా డాలర్లు 215, యూకే పౌండ్స్ 20, యూఏఈ ధీర్హామ్స్ 10, మలేషియా రింగేట్స్ 21, మాల్దీవ్స్ రుఫియాస్ 10, ఈరోస్ 10, సింగపూర్ డాలర్లు 2, మారిటియస్ 25 కరెన్సీ ఉన్నాయని చెప్పారు. దేవాలయానికి ఈ ఆదాయం కేవలం 28 రోజులకు మాత్రమే వచ్చిందని తెలిపారు.


ఈ నెల 31 దాటితే అనగా నవంబర్ 1 నుంచి కార్తీక మాసం ..శివునికి చాలా ఇష్టమైన మాసం. స్వామి వారి పూజలు చాలా ఇష్టంగా చేస్తారు భక్తులు. రద్దీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఈ కార్తీకమాసానికి భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో హుండి ఆదాయం మరింత ఎక్కువగా కూడా ఉంటుంది. అయితే ఈ ఆదాయం డబుల్ అయ్యే అవకాశాలున్నాయంటున్నారు ఆలయ అధికారులు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu shivalayam devotional srisailam

Related Articles