earth: భూమికి పొంచి ఉన్న ప్రమాదం.. దూసుకొస్తున్న సౌర తుఫాన్లు

సూర్యుడి నుంచి మూడు భారీ సౌర తుఫాన్లు భూమిని తాకనున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో వెలువడిన 3 తీవ్రస్థాయి సౌర తుఫాన్లు వచ్చే 2 రోజుల్లో భూమిని తాకనున్నాయి.


Published Aug 09, 2024 06:25:41 AM
postImages/2024-08-09/1723202133_strongsolar1715690737.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : సూర్యుడి నుంచి మూడు భారీ సౌర తుఫాన్లు భూమిని తాకనున్నాయి. ఈ నెల 7, 8 తేదీల్లో వెలువడిన 3 తీవ్రస్థాయి సౌర తుఫాన్లు వచ్చే 2 రోజుల్లో భూమిని తాకనున్నాయి. సోలార్ అండ్ హీలియో స్పెరిక్ అబ్జర్వేటరీ తెలిపింది.ఉపగ్రహాలు , కమ్యూనికేషన్స్ , పవర్ గ్రిడ్స్ వీటిపై ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

మొదటి రెండు అంత సీరియస్ గా తీసుకోకపోయినా మూడో తుఫాన్ మాత్రం కేటగిరీ-3 స్థాయిదని వివరించింది. సాంకేతిక మౌలిక వసతుల విషయంలో ముందుగా సన్నద్ధం కావాలని పిలుపునిచ్చింది. అంటే ఇండెరక్ట్ గా ప్రమాదాలు జరుగుతాయి . జాగ్రత్తలు అవసరమని తెలిపింది. గ‌డిచిన రెండు ద‌శాబ్ధాల్లో లేన‌టువంటి శ‌క్తివంత‌మైన సౌర తుఫాన్లు సంభవిస్తున్నట్లు కూడా తెలిపింది. క‌రోనాల్ మాస్ ఎజెక్స‌న్స్‌(సీఎంఈఎస్‌) సూర్యుడి నుంచి వెలుబ‌డ్డన‌ట్లు నేష‌న‌ల్ ఓసియానిక్ అండ్ అట్మాస్పియ‌రిక్ అడ్మినిస్ట్రేష‌న్ అంచ‌నా వేసింది. అయితే సౌర తుఫాన్ చాలా తీవ్రంగా ఉంద‌ని, ఎక్స్‌ట్రీమ్ జియోమాగ్నిక్ స్టార్మ్ అని ఆ తుఫాన్‌ను అప్‌గ్రేడ్ చేశారు.

రాబోయే రోజుల్లో మ‌రిన్ని సీఎంఈలు భూమిని తాకే అవ‌కాశాలు ఉన్న‌ట్లు వార్నింగ్ ఇచ్చారు. ఈ తుఫాన్ల వల్ల వాతావరణంలో కూడా భయంకరమైన మార్పులు కనిపిస్తాయని తెలిపారు. . సౌర తుఫాన్ వ‌ల్ల అయ‌స్కాంత క్షేత్రంలో మార్పులు సంభ‌వించే అవ‌కాశాలు ఉంటాయ‌ని తెలిపారు. ఈ తుఫాన్లు మితిమీరిన స్థాయిలో ఉంటే ఒక్కొక్కసారి ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేస్తారంటున్నారు సైంటిస్టులు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu earth

Related Articles