Telangana:వామ్మో తీన్మార్ మల్లన్న చేసేది.. ఇంత పెద్ద మోసమా ?

తిరుగుబాటును ఆదిలోనే అణచివేయాలి. లేకుంటే అది విప్లవం అయితది. ఉధ్యమ రూపం దాల్చి ఉవ్వెత్తున ఎగిసిపడ్తది. ఇదే పాలకులు వ్యవహరించే తీరు. తెలంగాణలో ఇప్పుడు బీసీ నినాదం


Published Sep 18, 2024 10:12:27 AM
postImages/2024-09-18/1726634547_mallanna.jpg

న్యూస్ లైన్ డెస్క్: తిరుగుబాటును ఆదిలోనే అణచివేయాలి. లేకుంటే అది విప్లవం అయితది. ఉధ్యమ రూపం దాల్చి ఉవ్వెత్తున ఎగిసిపడ్తది. ఇదే పాలకులు వ్యవహరించే తీరు. తెలంగాణలో ఇప్పుడు బీసీ నినాదం ఊపందుకుంది. మా జనమెంత...మా వాటా ఎంత ? మా ఓట్లు మాకే, మా పదవులు మాకే అన్న విప్లవం షురూ అయింది. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రెడ్డీ రాజ్య స్థాపన జరిగిన తర్వాత..బీసీల్లో  చైతన్యం పెరిగింది. దాంట్లో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీ నేతలు కొట్లాడుతున్నారు. ఆమరణ దీక్షలు చేస్తున్నారు. అయితే..ఇప్పుడిప్పుడే బలపడుతున్న బీసీ నినాదాన్ని బలహీన పర్చేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

బీసీ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు ఓ కన్నింగ్ ఐడియాతో ముందుకెళ్తోందంట. ఫ్యూచర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచి ఓ గేమ్ స్టార్ట్ చేసిందట. రాష్ట్రంలో ఇప్పటికే బీసీ నినాదం బలపడుతుండటంతో దీన్ని సొంతం చేసుకునేందుకు ఆరాట పడుతోందట. దీని కోసం సీక్రెట్ గా కొంత మందితో బీసీ నినాదాన్ని ముందుకు తీసుకెళ్తోందన్న చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు బీసీ నినాదం బాధ్యతలు అప్పగించిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. బీసీ నినాదం బలపడితే రాబోయే ఎన్నికల్లో గడ్డుకాలం ఎదురయ్యే ప్రమాదం ఉందని రేవంత్ రెడ్డి భావిస్తున్నారట.

అందుకే బీసీలను నమ్మించి ఓవైపు మళ్లీంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. బీసీ నినాదాన్ని మొదట్నుంచి లీడ్ చేసి ఆఖరికి దాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతలా చేయాలంటే జనాన్ని నమ్మించి మోసం చేసే వ్యక్తి కావాలని కాంగ్రెస్ పార్టీ ఆరా తీసిందట. దీంతో తీన్మార్ మల్లన్న కంట పడటంతో ఆ బాధ్యతలు అప్పగించిందట. ఇప్పటికే బహుజన వాదంతో ప్రజల్లోకి వెళ్లి,  ఇప్పుడు దానిని లేకుండా చేయడంలో తీన్మార్ మల్లన్న సక్సెస్ అయ్యాడని రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ భావిస్తోందట. అందుకే ఈ బాధ్యతలు అప్పగించారనే చర్చ నడుస్తోంది.  ఈ సీక్రెట్ మిషన్‌ను తీన్మార్ మల్లన్నకు అప్పగించడంతోనే సొంత పార్టీపై ఆయన తీవ్ర విమర్శలు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ మధ్య తీన్మార్ మల్లన్న రెడ్డిలకు వ్యతిరేకంగా, బీసీల నినాదంతో ముందుకెళ్తున్నారట. ఇటీవల జరిగిన బీసీ సభలో సైతం మల్లన్న మాట్లాడుతూ తనను ఓడించేందుకు రెడ్డిలు కుట్ర చేశారని కామెంట్స్ చేశారనే చర్చ నడుస్తోంది.

తన సోషల్ మీడియా ప్లాట్ ఫాంగా సమయం వచ్చినప్పుడుల్లా రెడ్డిలను ఇరుకునపెట్టడం, బీసీ నినాదాన్ని లేవనెత్తుతున్నాడట. ఈ విషయంలో రేవంత్ రెడ్డిని సైతం పలుమార్లు అందుకే విమర్శించాడనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు తన వల్లే పార్టీ అధికారంలోకి వచ్చిందని పదేపదే చెప్పుకుంటూ జనాలను ట్రాప్ చేస్తున్నాడట. సొంత పార్టీని, పార్టీలోని నేతలను తీన్మార్ మల్లన్న ఏకీపారేస్తున్నా, తీవ్ర విమర్శలు చేస్తున్నా ఆయనపై ఎవరూ నోరు మెదపడం లేదట. అంతా ఒక్కటే కావడం, తమ సీక్రెట్ మిషన్ లో భాగంగానే తిడుతుండటంతో ముఖ్యమంత్రి, మంత్రులు సైతం మౌనంగా ఉంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : news-line congress cm-revanth-reddy delhi runamafi bc teenmar-mallanna

Related Articles