బలిపీఠంపై ముగ్గురు ఎమ్మెల్యేలు..రేవంత్ షాకింగ్ నిర్ణయం..!

దెబ్బతిన్న పామును పూర్తిగా చంపేయాలి. లేదంటే అది పగపట్టి, కాటేసి చంపుతుంది. ఇప్పుడు ఇదే సామెతను సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవ్వాలని చూస్తున్నారట. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ,


Published Sep 18, 2024 11:30:56 AM
postImages/2024-09-18/1726639256_revanth1.jpg

న్యూస్ లైన్ డెస్క్: దెబ్బతిన్న పామును పూర్తిగా చంపేయాలి. లేదంటే అది పగపట్టి, కాటేసి చంపుతుంది. ఇప్పుడు ఇదే సామెతను సీఎం రేవంత్ రెడ్డి ఫాలో అవ్వాలని చూస్తున్నారట. రాష్ట్రంలో ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దెబ్బతిన్న బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా దెబ్బ తీసేందుకు ప్లాన్ వేస్తున్నారట. దీని కోసం కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతోనే పథకం రచిస్తున్నారని తెలుస్తోంది. తనకు తానే ఓ పరీక్ష పెట్టుకోవాలని.. అయితే అందులో విజయం మాత్రం తనదే అయ్యేలా అన్ని అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారని హస్తం పార్టీలోనే చర్చ జరుగుతోంది.   కారు దిగి హస్తం గూటికి చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలనే ఆలోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే అందరితో కాకుండా.. కొందరితోనే ఈ ప్రయోగం చేయాలని చూస్తున్నారట. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఇప్పటికే బీఆర్ఎస్ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై ఇటీవలే అసెంబ్లీ స్పీకర్ కు హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. దీంతో మరో మూడు వారాల్లో వారి అభ్యర్తిత్వంపై ఏదో ఒక నిర్ణయం రాబోతోంది. అయితే ఆ లోపే తమ ప్రణాళికను అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి రెడీ అయ్యారట.  ప్రస్తుతానికి ముగ్గురు ఎమ్మెల్యేల భవితవ్యం మాత్రమే స్పీకర్ చేతుల్లో ఉంది. దీంతో స్పీకర్ నిర్ణయం వచ్చేలోపే ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుతో రాజీనామా చేయించాలని చూస్తున్నారట.  అప్పుడు ఉప ఎన్నిక వస్తుంది.

ఆ సమయంలో అసలు వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నారట. రేవంత్ రెడ్డికి బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయనేది జగమెరిగిన సత్యం. అలాగే.. బీజేపీ లక్ష్యం కూడా కేసీఆర్ ను దెబ్బకొట్టడమే కావడంతో.. బైపోల్ లో కాషాయ జెండా సహకారంతో గెలుపుతీరాలకు చేరాలనే ప్రణాళికలు రచిస్తున్నట్టుగా చర్చ జరుగుతోంది.  ఉప ఎన్నికలు వస్తే బీజేపీ డమ్మీ అభ్యర్ధులను బరిలో దింపి.. కాంగ్రెస్ గెలుపు కోసం చేస్తుందని ఆ పార్టీ పెద్దలు కూడా భరోసా ఇచ్చారని సమాచారం. అందుకే ఎవరూ భయపడాల్సిన పని లేదని, రాజీనామా చేస్తే మళ్లీ గెలిపించుకుంటామని కడియం, దానం, తెల్లంకు భరోసా ఇచ్చారట సీఎం. అంతేకాదు ఈ ముగ్గురిలో ఏ అభ్యర్ధి ఓడినా వాళ్లకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి చట్టసభల్లోనే ఉండేలా చూసుకుంటానని కూడా మాట ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.  ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ను ఓడిస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి లేదని మరింత బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లొచ్చని కాంగ్రెస్, బీజేపీ ఉమ్మడిగా ఆలోచన చేశాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

బీఆర్ఎస్ ను ఉప ఎన్నికల్లో ఓడిస్తే కాంగ్రెస్ పార్టీతో పాటు అటూ బీజేపీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ లేకుండా పోతుందని, అప్పుడు ఏదైనా రెండు జాతీయ పార్టీలే చూసుకోవచ్చని ఓ అండర్ స్టాండింగ్ కు వచ్చారట. అందుకే సీక్రెట్ గా ఈ వ్యవహారాన్ని నడిపించాలని చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఇందులో మరో లాభాన్ని కూడా చూసుకుందట కాంగ్రెస్. రాష్ట్రంలో కాంగ్రెస్ బలంగా ఉందని చూయించుకోవడానికి ఇది ఓ అవకాశమని భావిస్తున్నారట. రాజీనామా చేసిన ముగ్గురు అభ్యర్ధులు గెలిస్తే..  బీఆర్ఎస్ నుంచి ఆగిపోయిన వలసలు మళ్లీ మొదలవుతాయనే ఆశతో ఉన్నారట. తద్వారా కారు పార్టీకి ఉన్న ప్రతిపక్ష హోదాను కూడా తొలగించవచ్చనే భావనతో ముందుకెళ్తున్నట్టు తెలుస్తోంది.

newsline-whatsapp-channel
Tags : telangana revanth-reddy newslinetelugu mla danamnagender komatireddyvenkatreddy

Related Articles