భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో భక్తులు , చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : పంజాబ్ అమృత్ సర్ స్వర్ణ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇనుపరాడ్డుతో దాడి చేశారు. ఈ దాడిలో దాదాపు ఐదుగురు వ్యక్తులు గాయపడ్డారు. దాడిచేసిన వ్యక్తిని పోలీసులు వెంటనే అరెస్ట్ చేసినా ..పరిస్థితి అదుపు చేయడానికి దాదాపు 30 నిమిషాలు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది.
భక్తులు, స్థానికులు ఉన్న కమ్యూనిటీ కిచెన్ వద్ద దుండగుడు ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. దీంతో భక్తులు , చిన్నారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ దాడిలో గాయపడిన వారిలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీకి చెందిన ఇద్దరు వాలంటీర్లు కూడా ఉన్నారు. గాయపడిన ఐదుగురిని ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు రెక్కీ నిర్వహించి ఈ దాడికి పాల్పడినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.