New Rulls:గణనాథున్ని పెడుతున్నారా..ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి.!

భారతదేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాలలో మరింత ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాంటి గణపతి నవరాత్రి ఉత్సవాల


Published Aug 27, 2024 09:01:13 AM
postImages/2024-08-27//1724729473_vinayaka.jpg

న్యూస్ లైన్ డెస్క్:భారతదేశ వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. ఇక ఈ పండుగను మన తెలుగు రాష్ట్రాలలో మరింత ఉత్సాహంగా జరుపుకుంటారు. అలాంటి గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా  గణనాథున్ని మండపాల్లో ప్రతిష్టింప చేయాలి అంటే తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ పర్మిషన్ కోసం ఆగస్టు 27వ తేదీ నుంచి సెప్టెంబర్ 6 వరకు   https://www.tspolice.gov.in అనే సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

అంతేకాకుండా  గణనాథున్ని మండపాల వద్ద రెండు బాక్సుల టైపు లౌడ్ స్పీకర్లు మాత్రమే ఉపయోగించాలని, అలాగే రాత్రి 10:00 నుంచి మొదలు ఉదయం 6 గంటల వరకు ఈ సౌండ్ బాక్స్ లను అస్సలు ఉపయోగించరాదని  నిబంధనలు పెడుతున్నారు.  ఏదైనా సహకారం కావాలంటే 8712665785కి కాల్ చేయాలని తెలియజేశారు.

 నిబంధనలు :
 మీ పరిధిలోని పోలీస్ స్టేషన్ అనుమతి తప్పనిసరి.

 కరెంట్ కనెక్షన్ కోసం డిడి తప్పనిసరిగా కట్టాలి.

మండపాల నిర్మాణానికి రోడ్డును బ్లాక్ చేయవద్దు.

 కనీసం 2 వీలర్ వెళ్లేందుకైనా దారినివ్వండి.

డీజేలు పెట్టడానికి అనుమతి లేదు.

రాత్రి పది దాటిన తర్వాత మైకులు ఆఫ్ చేయాలి.

 ప్రతి మండపం వద్ద  సీసీ కెమెరాలు అమర్చుకోవడం మరింత మంచిది.

 ప్రతి ఒక్కరూ ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతంగా పండగను జరుపుకోవాలని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ, పోలీసులు తెలియజేస్తున్నారు. ఈ రూల్స్ ఎవరు తప్పిన తప్పనిసరిగా చర్యలు  ఉంటాయని వారు అంటున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu ganapathi rulls hyderabad-police no-dj permission

Related Articles