Flower: ఇంట్లో వికసించిన అరుదైన పుష్పం

అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒక ఇంట్లో ఒకేసారి 80 పువ్వులు వికసించడం మరి అదే రోజు వినాయక చవితి కావడంతో వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.


Published Sep 08, 2024 04:30:25 PM
postImages/2024-09-08/1725793225_flower.PNG

న్యూస్ లైన్ డెస్క్: అత్యంత అరుదుగా పుష్పించే బ్రహ్మకమలం కేవలం హిమాలయాల్లో మాత్రమే సహజసిద్ధంగా వికసిస్తుంది. సాధారణంగా జూలై నుంచి సెప్టెంబరు మధ్య కాలంలోనే ఇది పుష్పిస్తుంది. అది కూడా కేవలం ఒక్క రాత్రి మాత్రమే ఇది కనిపిస్తుంది. ఈ పువ్వు రాత్రిళ్లు మాత్రమే వికసించడం వల్ల దీనికి రేరాణి అని కూడా పేరుంది. సైన్స్‌ పరంగా ఈ పువ్వును నైట్‌ బ్లాసమింగ్‌ సిరియస్‌ అని పిలుస్తారు. ఇందులో అనేక ఔషధ గుణాలుండడం వల్ల ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. అలాంటి అరుదుగా కనిపించే బ్రహ్మ కమలాలు ఒక ఇంట్లో ఒకేసారి 80 పువ్వులు వికసించడం మరి అదే రోజు వినాయక చవితి కావడంతో వారి సంబరాలు అంబరాన్ని అంటాయి.

వారాసిగూడకు చెందిన పిల్లా శ్రీనివాస్ ఇంట్లో గత సంవత్సరం బ్రహ్మ కమలం చెట్టు పెట్టాగా నిన్న రాత్రి ఒక్కసారి గా 80 పువ్వులు వికసించడంతో చాలా ఆనందం కలిగించిందని ఇంటి యజమాని పిల్లా శ్రీనివాస్ తెలిపారు. అది కూడా వినాయక చవితి రోజే రావడం చాలా మంచి పరిణామంగా భావిస్తున్నామన్నారు. కాగా, శ్రీనివాస్ సీఎంవోలో సెక్షన్ ఆఫీసర్ గా విధులు నిర్వహిస్తున్నారు. కాగా, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌ ఆలయాలకు వెళ్లే భక్తులు స్వామివార్లకు భక్తిశ్రద్ధలతో బ్రహ్మకమలం  పుష్పాన్ని సమర్పిస్తుంటారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఈ ఆనవాయితీ కొనసాగుతోంది.

newsline-whatsapp-channel
Tags : india-people ts-news temple badrinath

Related Articles