మన్నేరు వాగు పరీవాహక ప్రాంతంలో వేలాది ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి అని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: మన్నేరు వాగు పరీవాహక ప్రాంతంలో వేలాది ఇల్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి అని బీఆర్‌ఎస్ నాయకుడు రాకేశ్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన వరద బాధితులను పరమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందస్తు హెచ్చరికలు లేకపోవడం, తీవ్రతను అంచనా వెయ్యలేకపోవడం వాళ్ల తీవ్ర ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ముంపు గురైన ఇళ్ల పరిస్థితి హృదయ విధారకంగా ఉందని, మున్నేరు వాగు పరీవాహక ప్రాంతంలోని ఇళ్లను మింగేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కట్టుబట్లలు ఇల్ల గోడలు తప్పా ఏం మిగలలేదని, 24 గంటలు కావస్తున్నా ప్రభుత్వం వైపు నుండి కనీసం వాటర్ ట్యాంక్ లు, ఆహారం అందించే నాథుడే లేడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లో కష్టపడి కొనుగోలు చేసుకున్న విలువైన వస్తువులు టీవీ, ఫ్రిడ్జి, వాషింగ్ మెషిన్ పూర్తిగా నీట మునిగి పాడైపోయాయి అన్నారు. కట్టుకోవడానికి బట్టలు, వండుకోవడానికి బియ్యం, వంట సామగ్రి సైతం నీట కొట్టుకపోయాయి అని తెలిపారు. కట్టుబట్టలతో వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డారని, సుమారు ఇంటింటికి లక్ష నుండి 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగల బలమైన ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ కనీసం అత్యాధునిక సేవలు ఉపయోగించి ప్రాణాలు కాపడలేకపోవడం సిగ్గుచేటు అన్నారు. కట్టుబట్టలు ఇంటి గోడలు తప్పా ఏం మిగలలేదని, పునరావాస కేంద్రాల్లో పసి పిల్లలు పాలకు ఏడుస్తున్నారని తెలిపారు. హైదారాబాద్ లో కంట్రోల్ రూంలో ఉన్న మంత్రులు ఖమ్మం రావాలని, ఆపదలో ప్రజలను ఆదుకోలేని ప్రభుత్వం, పవర్ ఉండేం లాభం అని అన్నారు. రాజకీయ విమర్శలకు ఇది సమయం కాదని, భావించినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని మండిపడ్డారు. కనీసం పునరావాస కేంద్రాల్లో చిన్నారులకు పాలు, నీళ్ళు, ఆహార పదార్ధాలు అందించే వ్యవస్థ కూడా లేకపోవడం దారుణం అన్నారు. తక్షణమే ఇంటింటికి జరిగిన నష్టాన్ని అంచనా వేసి నష్టపరిహారం చెల్లించాలని, ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఒక్కొక్కరికి 50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని రాకేశ్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.