గురువారం రోజు కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో మాచర్ల ఏసోబు అలియాస్ రణదేవ్‌కు బీఆర్ఎష్ నేతలు టి. రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు.
న్యూస్ లైన్ డెస్క్: గురువారం రోజు కాజీపేట మండలం టేకులగూడెం గ్రామంలో మాచర్ల ఏసోబు అలియాస్ రణదేవ్‌కు బీఆర్ఎస్ నేతలు టి. రాజయ్య, దాస్యం వినయ్ భాస్కర్ నివాళులు అర్పించారు. చత్తీస్ ఘడ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో రణదేవ్ మరణించారు. చత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా బైలడిల్లా అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య ప్రాంత ఇన్చార్జి మాచర్ల ఏసోబు(70) అలియాస్ జగన్, రణధీర్, దాదా చనిపోయారు.
ఈ ఎన్కౌంటర్లో మొత్తం 9 మంది చనిపోగా అందులో జగన్‌తో పాటు పీఎల్డీఏ సభ్యురాలు శాంతి, ఏరియా కమిటీ మెంబర్లు మడకం సుశీల, గంగి ముచికీ, కోసా మడవి, డివిజన్ కమిటీ సభ్యులు లలిత, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ గార్డు కవిత, డివిజన్ కమిటీ సభ్యుడు హిడ్మే మడకాం, ప్లాటూన్ సభ్యుడు కమలేశ్ అన్నట్లు ఐజీ తెలిపారు. ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో రెండు 303 రైఫిల్స్, రెండు 12 బోర్ రైఫిల్స్, రెండు బర్మార్ బందూక్లు, ఎస్ఎల్ఆర్, దేశీయ కార్బన్ 9ఎంఎం, 8 ఎంఎఎం రైఫిల్, 315 బోర్ రైఫిల్, బీజీఎల్ లాంచర్ తో పాటు భారీగా పేలుడు పదార్ధాలను స్వాధీనం చేసుకున్నట్టు ఐజీ తెలిపారు.