జైనూరులో అత్యాచారానికి గురై తీవ్ర గాయాలతో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించడానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: జైనూరు అత్యాచార బాధితురాలు చికిత్స పొందుతున్న ఆదివాసీ మహిళను పరామర్శించడానికి మాజీ మంత్రులు, బీఆర్ఎస్ ఎమ్మేల్యేలు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే కోవా లక్ష్మి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకుని, ఆదివాసీ మహిళను బీఆర్‌ఎస్ బృందం పరామర్శించారు. పరామర్శించిన అనంతరం మీడియాతో బీఆర్ఎస్ మాజీ మంత్రి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అత్యాచారాలు అనేది నిత్యకృత్యం అయిందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాడిన తర్వాత 1900 అత్యాచార కేసులు నమోదైందని ఆయన అన్నారు.
రాష్ట్రంలో మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల మీద స్పందించడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేదా అని ప్రశ్నించారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నా ఈ ప్రభుత్వం ఇంక మేల్కోకపోవడం చాలా బాధాకరం అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను గాలికి వదిలేసి, ఏది జరిగినా ఈ ప్రభుత్వానికి సంబంధం లేనట్టు వ్యవరిస్తున్నారని హరీష్ రావు మండిపడ్డారు. ముఖ్యమంత్రి దగ్గరే హోం శాఖ ఉందని ప్రతి రోజూ 2 హత్యలు, 4 మానభంగాలు అన్నట్టు అయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రోజు ముఖ్యమంత్రి వరద విపత్తు సహాయంలో ఫెయిల్, లా అండ్ ఆర్డర్, రుణమాఫీ, విద్యా వ్యవస్థను నడిపించడంలో ముఖ్యమంత్రి రేవంత్ ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఎంత సేపు ప్రతిపక్షాలను వేధించడం, అక్రమ కేసులు పెట్టడం తప్ప పాలనను గాలికి వదిలేశారని హరీష్ రావు అన్నారు.