ప్రజారాజ్యంలో అణిచివేతలేనా, రైతులు బాధలు చెప్పుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు.
న్యూస్ లైన్ డెస్క్: ఆగస్టు15 లోగా రైతులందరికి రుణ మాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టేసి రైతులను దగా చేశారని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ యాదాద్రిలోని తూర్పు రాజ గోపురం వద్ద పాప పరిహార పూజలు నిర్వహించి ముఖ్యమంత్రి చేసిన పాపం తెలంగాణ ప్రజలకు శాపం కాకుండా చూసి రక్షించాలని లక్ష్మీ నరసింహ స్వామికి పూజలు చేశామని ఆయన అన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుకు కేసీఆర్ పిలుపు మేరకు రైతు ధర్నా చేశామని తెలిపారు. బాల్కొండలో పోలీసులు ధర్నాలో పాల్గొనొద్దని ప్రజలకు నోటీసులు ఇచ్చారని కొండారెడ్డి పల్లిలో సరితా, విజయ రెడ్డి అనే జర్నలిస్టుల మీద దాడి చేయడం దారుణం అన్నారు. అదిలాబాద్‌లో మొన్న రైతులను అరెస్టులు చేశారని మండపడ్డారు. ప్రజారాజ్యంలో అణిచివేతలేనా, రైతులు బాధలు చెప్పుకునే హక్కు కూడా ప్రజలకు లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం దుర్మార్గపు చర్యలను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఋణ మాఫీ అని రణం చేస్తున్నారని, ఎద్దు ఏడ్చిన ఏవుడం రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు అని అన్నారు. రుణమాఫీ వంద శాతం చేసేదాకా రేవంత్ సర్కార్ వెంటపడతామని ఎమ్మెల్యే కాలేరు స్పష్టం చేశారు. పోలీసులు చట్టానికి బద్దులై పని చేయాలని సూచించారు. అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు అని మోసం చేశారని, యాదాద్రి లక్ష్మి నరసింహా స్వామి మీద కూడా ఒట్టు వేసి మాట తప్పారని విమర్శించారు. ప్రజలకు ఆ పాపం జరగవద్దని దివాలాకోరు సీఎంను క్షమించాలని, ప్రజలకు మంచి జరగాలని వేడుకున్నామని అన్నారు. పంద్రాగస్టు అయిపోయింది కానీ రుణమాఫీ కాలేదని ఏద్దేవా చేశారు. 17 లక్షల రైతులకు రుణమాఫీ చేసేది ఉందని ఉత్తమ్ అంటారు. పొంగులేటి 12 వేల కోట్లు అన్నారు. తుమ్మల 17 వేల కోట్లు మాత్రమే చేశామని అంటారు. ఇంకా మొత్తం 31 వేల కోట్లు చేసేది ఉందన్నారు. అయ్యింది తక్కువ కానిది ఎక్కువ అన్నారు. ఇది వ్యవసాయ మంత్రి తుమ్మల చెప్పిన మాట అని ఆయన తెలిపారు. ఇంకా రేవంత్ సర్కార్ 56 శాతం రుణమాఫీ బాకీ ఉందని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పేర్కొన్నారు.