బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల అయ్యారు.
న్యూస్ లైన్ డెస్క్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి విడుదల అయ్యారు. జైలు నుంచి బయటకు వచ్చాక కవిత మీడియాతో మాట్లాడారు. 18 ఏళ్లు నేను రాజకీయాల్లో ఉన్నాను.. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను.. ఈ ఐదు నెలలు కుటుంబానికి దూరంగా ఉన్నాను.. నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్లకు వడ్డీతో సహా చెల్లిస్తాను అని అన్నారు. నేను కేసీఆర్ బిడ్డను, మొండిదాన్ని, తప్పుచేయకున్నా జైలుకు పంపారు. అనవసరంగా నన్ను జగమొండిగా మార్చారు. బీఆర్‌ఎస్ సమయం వస్తుందని, ఎవరికి భయపడేది లేదు అని కవిత స్పష్టం చేశారు.
మంగళవారం ఢిల్లీ మద్యం పాలసి కేసులో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ మంజారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో కవితను ఈ ఏడాది మార్చి 25న ఈడీ అధికారులు హైదరాబాద్‌లోని కవిత నివాసంలో అరెస్టు చేశారు. ఆ తర్వాత ఏఫ్రిల్ 11న సీబీఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. నేడు కేసులో నిరహదిక్ష సుప్రీంకోర్టు పరిగణిస్తూ కవితకు బెయిల్ మంజూరు చేసింది.
165 రోజుల తరువాత తీహార్ జైలు నుండి విడుదలైన ఎమ్మెల్సీ కవిత pic.twitter.com/TrhQfr1RI5 — Telugu Scribe (@TeluguScribe) August 27, 2024