KTR: ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు.. ఖండించిన కేటీఆర్!

Published 2024-07-03 19:05:41

postImages/2024-07-03/1720013741_bmla.PNG

న్యూస్ లైన్ డెస్క్: అసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మి పైన కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎమ్మెల్యేల పైన కూడా అక్రమంగా కేసులు నమోదు చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం, ప్రోటోకాల్ ఇవ్వకుండా అడ్డగోలుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకుల వైఖరికి నిరసన తెలిపినందుకు పోలీసులు, ఎమ్మెల్యేల పైనే ఏకపక్షంగా కేసు నమోదు చేయడం అక్రమం అన్నారు. పోటీ నిరసన కార్యక్రమాలు చేపట్టిన కాంగ్రెస్ నాయకులపై ఫిర్యాదు చేసినా, ఇప్పటివరకు కేసు నమోదు చేయలేదన్నారు. కోమరభీం జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది. ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీశాయి. ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు 296(B), 351(2) సెక్షన్ల కేసు నమోదు చేశారు.