KTR: సర్కార్ గురుకుల విద్యార్థులను పట్టించుకోవడం లేదు

గురుకుల పోస్టుల భర్తీని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.


Published Aug 13, 2024 09:47:33 AM
postImages/2024-08-13/1723558217_guru2.PNG

న్యూస్ లైన్ డెస్క్: గురుకుల పోస్టుల భర్తీని తదుపరి మెరిట్ అభ్యర్థులతో భర్తీ చేయాలని ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో డౌన్ మెరిట్ లిస్ట్ ఆపరేట్ చేయడం ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. గురుకుల బోర్డు చేపట్టిన నియమాకాలలో 9024 పోస్టులలో డిసెన్డింగ్ ఆర్డర్ పాటించకపోవడం చాలామంది ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం మూలంగా సెకండ్ మెరిట్‌లో ఉన్న వారికి నష్టం జరుగుతున్నదని అభ్యర్థులు తెలిపారు. గురుకుల పోస్టులలో భర్తీ కాకుండా మిగిలిపోతున్నటువంటి పోస్టులను తదుపరి మెరిట్ అభ్యర్థుల్లో భర్తీ చేసే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని దీని కోసం ప్రతిపక్ష పార్టీగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని గురుకుల అభ్యర్థులు కేటీఆర్‌కి తెలిపారు. ఇప్పటికే తెలంగాణ హైకోర్టు జీవో ఎంఎస్ నెంబర్ 81ను సవాల్ చేస్తూ ఐదు మభ్యంతర ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ ప్రభుత్వం తరుపున జీవో ఎంఎస్ నెంబర్ 81ను అడ్డంకిగా చూపిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని అభ్యర్థులు కేటీఆర్‌కి వివరించారు.

గతంలో టీఎస్ ట్రాన్స్కో, టీఎస్ఎస్పీడీసీఎల్, టీఎస్ఎన్పీడీఎస్ నిర్వహించిన వివిధ నోటిఫికేషన్లలో ప్రస్తుతం గురుకులాల్లో ఏర్పడుతున్నట్టుగానే భారీ సంఖ్యలో ఖాళీలు ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు నిరుద్యోగులు నష్టపోకుండా ఉండడం కోసం జీవో ఎంఎస్ నెంబర్ 81 అమలు చేయకుండా వన్ టైం రిలాక్సేషన్ కల్పించి పోస్ట్ మిగిలిపోకుండా డౌన్ మెరిట్ ఆపరేట్ చేసి తదుపరి మెరిట్ ఉన్న అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిందని అభ్యర్థులు కేటీఆర్‌కి తెలిపారు.

గతం లాగానే ఈ గురుకుల పోస్టుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని గురుకులతో పాటు డీఎస్సీ అభ్యర్థుల అనేకమంది న్యాయం కోసం ఎదురుచూస్తున్నారని మీరందరికి న్యాయం చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అభ్యర్థులు కేటీఆర్‌కి విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై సానుకూలంగా కేటీఆర్ స్పందించారు. తప్పకుండా గురుకుల విద్యార్థులకు & డీఎస్సీ విద్యార్థులకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని అభ్యర్థులకు ఆయన హామీ ఇచ్చారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి ఫోన్ చేసి వీరి సమస్యను సానుకూలంగా పరిష్కరించాలని, ఇందుకు ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs congress ktr cm-revanth-reddy gurukulateacheraspirants

Related Articles