భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దినంగా' గా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు
న్యూస్ లైన్ డెస్క్: 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తన నియంతృత్వ మనస్తత్వాన్ని ప్రదర్శిస్తూ దేశంలో ఎమర్జెన్సీని విధించి భారత ప్రజాస్వామ్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏ కారణం లేకుండానే లక్షల మందిని జైల్లో పెట్టి మీడియా గొంతు నొక్కారు. దాంతో భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దినంగా' గా పాటించాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం ప్రకటించారు. జూన్ 25ను సంవిధాన్ హత్యా దివస్‌గా జరుపుకోవాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని అమిత్ షా సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ఇందిరా గాంధీ ఎమర్జెన్సీ విధించి దేశంలో చీకటి అధ్యాయానికి తెరలేపారని, ప్రధాని నరేంద్ర మోడీ సహా బీజేపీ అగ్రనేతలు కాంగ్రెస్‌పై విరుచుకుపడుతున్నారు. రాజ్యాంగాన్ని ఏమాత్రం ఖాతరు చేయని కాంగ్రెస్ ఇప్పుడు రాజ్యాంగం పట్ల ప్రేమ ఒలకబోస్తోందని అమిత్ షా కాంగ్రెస్‌పై విమర్శలు చేశారు. రాజ్యాంగానికి పలుమార్లు సవరణలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ అని, అలాంటి పార్టీ బీజేపీపై రాజ్యాంగాన్ని మార్చేస్తామని అసత్యాలు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. 1975 ఎమర్జెన్సీ యొక్క అమానవీయ బాధను భరించిన వారందరి అపారమైన సహకారానికి స్మరించుకుంటుందని షా పేర్కొన్నారు.