అయితే, చంపై సోరెన్ బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన నిజం చేస్తూ బీజేపీ కండువా కప్పుకున్నారు.
న్యూస్ లైన్ డెస్క్: జార్ఖండ్ మాజీ సీఎం చంపై సోరెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం చంపై సోరెన్ బీజేపీ పార్టీలో చేరారు. కాగా, హేమంత్ సోరెన్ ఈడీ, సీబీఐ కేసులో జైలుకు వెళ్లిన తర్వాత చంపై సోరెన్ ఐదు నెలల పాటు జార్ఖండ్ సీఎంగా చేశారు. ఇక హేమంత్ సోరెన్ బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు. అయితే, చంపై సోరెన్ బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను ఆయన నిజం చేస్తూ బీజేపీ కండువా కప్పుకున్నారు.