Revanth Reddy : రేవంత్ కి చెక్ పెడుతున్న కాంగ్రెస్.. అంతేనా ఇక


Published Sep 02, 2024 07:08:53 PM
postImages/2024-09-02//1725284333_RevanthReddy.jpg

న్యూస్ లైన్ డెస్క్ :  ‘‘తానొక్కటి తలిస్తే.. దైవం మరొకటి తలిచిందన్నట్లుగా‘‘ రేవంత్ రెడ్డ పరిస్థితి ఉందట. తాను చెప్పిందే అధిష్టానం చేస్తుందని ఎగిరెగిరిపడిన రేవంత్ కు అధిష్టానం ఊహించని షాక్ ఇచ్చిందట. ఢిల్లీలో మొన్నటి వరకు తాను ఏదీ చెబితే అది చెల్లుబాటు అయ్యిందని ఎగిరెగిరి పడితే ఇప్పుడు ఆయన్ను పట్టించుకునే నాథుడే కరువయ్యారట. ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసినా, సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీ ఇంటి ముందు నిలబడినా , ఆయనకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వడం లేదట. మొన్నటి వరకు వెళ్లగానే అపాయింట్‌మెంట్ దొరికితే ఇప్పుడు గంటలు, రోజుల తరబడిగా ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చిందట.  అసెంబ్లీ ఎన్నికల నుంచి మొదలు మొన్నటి పార్లమెంట్ ఎన్నికల వరకు రేవంత్ చెప్పిన ప్రతిమాటకు రాహుల్ ఓకే చెప్పారు. సీట్ల విషయంలోనూ అస్సలు కంప్రమైజ్ కాలేదు. రేవంత్ చెప్పినవాళ్లకే టికెట్లు ఇచ్చారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ రివర్స్ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది.

సీఎం రేవంత్‌ ప్రస్తుత పరిస్థితికి ఆయన వ్యవహార శైలి, తన కుటుంబీకులే కారణమనే చర్చ కాంగ్రెస్‌ వర్గాల్లో జోరుగా జరుగుతున్నది. సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి ఆయన తమ్ముడు కొండల్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్రయాణించడం మొదలు, అమెరికా పర్యటనలో సీఎం తమ్ముడికి చెందిన స్వచ్ఛ్‌ బయోగ్రీన్‌ సంస్థతో ఒప్పందం చేసుకోవడం, అన్న తిరుపతిరెడ్డి షాడో సీఎంగా చలామాణి అవుతున్నారన్న ఫిర్యాదులు అధిష్ఠానానికి ఎప్పటికప్పుడు వెళ్తున్నాయని చెప్పుకుంటున్నారు. అంతేకాదు పార్టీ గురించి కాకుండా, తన సొంత ఇమేజీ కోసం నిర్ణయాలు తీసుకోవడంప్రభుత్వంలో ఒంటెత్తు పోకడలు, పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడం, తనకు సంబంధించిన వాళ్లకే పదవులు ఇవ్వడం లాంటి వ్యవహారాలతో పాటు సీఎంగా తాను చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోవడం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న వ్యతిరేకత వంటి కారణాలతో రేవంత్ రెడ్డిపై అధిష్టానం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. ఇలాంటి కారణాలతో రేవంత్ రెడ్డిని అధిష్టానం దూరం పెడుతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.

రేవంత్ రెడ్డి –  అధిష్టానం మధ్య పెరిగిన గ్యాప్ గురించి జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఒకప్పుడు ఎప్పుడు పిలిచినా వచ్చిన గాంధీ కుటుంబం, ఇప్పుడు రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు కూడా రామని చెప్పడమే ఓ ఎగ్జాంపుల్ గా చెబుతున్నారు. రూ.2లక్షల రుణమాఫీ చేశామని, ఓ భారీ బహిరంగసభ పెడితే హాజరుకావాలని రాహుల్ కు ఇప్పటికే పలుమార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోపోవడం. పార్లమెంట్ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి పీసీసీ చీఫ్, కేబినెట్ విస్తరణపై అనేక సార్లు చర్చలు జరిపినా రేవంత్ రెడ్డి పెట్టిన లిస్ట్‌ను అధిష్టానం ఆమోదించకపోవడం కూడా ఓ  కారణమని ప్రచారం జరుగుతోంది. అందుకే ఇన్నిసార్లు ఢిల్లీ వెళ్లినా పీసీసీ చీఫ్ నియామకం కాలేదు, కేబినెట్ విస్తరణ జరగలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.

అధిష్టానం నిర్ణయం తీసుకోకముందే ప్రభుత్వ సలహాదారుగా పోచారం శ్రీనివాస్‌రెడ్డి, డెయిరీ కార్పొరేషన్‌ చైర్మన్‌గా గుత్తా అమిత్‌ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే దీనిపై అధిష్టానం కాస్త సీరియస్ అయ్యిందట. తాము గ్రీన్ సిగ్నల్ ఇచ్చే వరకు బాధ్యతలు తీసుకోకుండా చూడాలని ఆదేశించిందట. అందుకే ఇప్పటి వరకు వాళ్లు బాధ్యతలు తీసుకోలేదనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రేవంత్ రెడ్డికి మరో కీలక బాధ్యత కూడా అప్పగించనే గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి. త్వరలో దేశంలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఖర్చు కోసం ఫండ్ చూడాలని ఆదేశించిందట. మొదట ఫండ్ కలెక్ట్ చేసిన తర్వాతే పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల అంశాలు చర్చిద్దామని చెప్పిందట. దీంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం బ్యాగులు సర్దే పనిలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

newsline-whatsapp-channel
Tags : congress delhi-tour rahul-gandhi congress-government delhi national latest-news news-updates mallikharjunakharge sonia

Related Articles