వీటిలో ముఖ్యంగా Butterfly effect. ఎక్కడో ఒక చిన్న సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే, ఆ ఉదృతి మరొక చోట పెద్ద తుఫాను సృష్టించగలదు అనేది చాలా మంది నమ్ముతున్న సిద్ధాంతం.
న్యూస్ లైన్ స్పెషల్: చేసిన తప్పులకు కర్మ అనుభవించాల్సిందేనా..మరి పూజలు, వ్రతాలు, హోమాలు తప్పించలేవా అనే ప్రశ్న చాలా సార్లు తలెత్తుతుంది. అసలు కర్మ అనేది ఏంటి, దాని నుండి తప్పించుకోవడం సాధ్యమేనా అనే అంశం మరోసారి తెరపైకి వచ్చింది.
అయితే. కర్మ నుండి తప్పించేందుకు పూజలు, వ్రతాలు సహాయపడిన ఘటనలు కొన్ని పురాణాల్లో కూడా ఉన్నాయి. మార్కండేయుడు అనే బాలుడు తక్కువ ఆయుష్షుతో పుడతాడు. మరి కొన్ని రోజుల్లో మరణం దగ్గరపడుతోంది. దీంతో ఆ బాలుడు శివుడి తప్పస్సు కోసం మహా తపస్సు చేస్తాడు. ఆ బాలుడి ప్రాణం పోలేదు.సాక్షాత్తూ యమ ధర్మరాజు గారే పాశం విసిరినా కూడా ఆ బాలుడి ప్రాణం పోలేదు. స్వయానా ఆ పరమశివుడే ఆ బాలుడిని మృత్యువు నుంచి రక్షించాడు.
పురాణాల్లోనే కాకుండా సైన్స్ లో కూడా దీనికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా Butterfly effect. ఎక్కడో ఒక చిన్న సీతాకోకచిలుక రెక్కలు ఆడిస్తే, ఆ ఉదృతి మరొక చోట పెద్ద తుఫాను సృష్టించగలదు అనేది చాలా మంది నమ్ముతున్న సిద్ధాంతం.
'జ్ఞానాగ్ది దగ్ద కర్మాణం', మీ దగ్గర జ్ఞానం అనే అగ్ని అంటే, ఆ అగ్ని మీ కర్మ లు అన్నిటినీ ఒక్క క్షణంలో దగ్ధం చేస్తుందని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు. అయితే ఆ జ్ఞానం అనే అగ్ని మన దగ్గర ఉంటే ఈ పూజలు, వ్రతాలు, అభిషేకాలు ఇలాంటివన్నీ అవసరం ఉందా అనే మరో వాదన కూడా వినిపిస్తోంది. అయితే, ఆ స్థాయి జ్ఞానం అనే పరిణితి సాధించే వరకూ ఈ పూజలు, అభిషేకాలను కూడా తక్కువ చేయాల్సిన అవసరం లేదని మరికొందరు చెబుతున్నారు.