DSC: మోకాళ్లపై డీఎస్సీ అభ్యర్థుల నిరసన 

డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని జనగామ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ జేఏసీ ఆద్వర్యంలో మోకాళ్లపై నిల్చొని గురువారం వినూత్న నిరసన తెలిపారు


Published Jul 11, 2024 05:08:04 AM
postImages/2024-07-11/1720692126_dscex.PNG

న్యూస్ లైన్ డెస్క్: డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని జనగామ జిల్లా కేంద్రంలో నిరుద్యోగ జేఏసీ ఆద్వర్యంలో మోకాళ్లపై నిల్చొని గురువారం వినూత్న నిరసన తెలిపారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, 33 లక్షల నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీని గెలిపించారని తెలంగాణ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్ మంగళంపల్లి రాజు అన్నారు. అయితే గెలిపించిన వెంటనే నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా అని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు అమ్ముడు పోయారని అంటున్నారన్నారు. దీనిపై తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తీవ్రంగా కండిస్తుందని మంగళంపల్లి రాజు తెలిపారు. నిరుద్యోగులు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను కలిసి డీఎస్సీ పరీక్షలు వాయిదా కోసం నిలదీయాలని రాజు నిరుద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిరుద్యోగ జేఏసీ నాయకులు, కేయూ జేఏసీ నాయకులు గన్ను కార్తీక్, ఆసర్ల సుభాష్ మాట్లాడుతూ డీఎస్సీకి చదువుకోవడానికి సమయం ఇవ్వని సీఎం రేవంత్ రెడ్డికి ప్రభుత్వ పథకాలు అమలు చేయడానికి మాత్రం సమయం కావాలని కోరడానికి ఏం అర్హత ఉందని నిలదీశారు. జేఏసీ నాయకులు తుంగ కౌశిక్, వెంపటి అజయ్ మాట్లాడుతూ నిరుద్యోగులకు అండగా ఉంటా అన్న ఫ్రొఫెసర్ కోదండ రామ్, ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, బాల్మ్యూరి వెంకట్, ఫొఫెసర్ రియజ్‌లు ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వం డీఎస్సీ ఎగ్జామ్ వాయిదా వేసేంతా వరకు నిరుద్యోగులు నిరసనలు తెలుపుతారని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాజు, దినేష్, అన్వేష్, చరణ్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
 

newsline-whatsapp-channel
Tags : telangana students congress cm-revanth-reddy dsc

Related Articles