ప్రతి పిల్లలకు తల్లిగా నేర్పాల్సిన కొన్ని విషయాలుంటాయి. అయితే ఆడ , మగ అనే తేడాలేకుండా మగపిల్లలకు చెప్పాల్సినవి చెప్పాలి
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ఆడపిల్లలు పుట్టాలని ఆశపడుతున్నారు కాని ...కాపాడలేకపోతున్నామనే భయం కూడా ఇప్పటి తల్లితండ్రుల్లో ఉంది. విషయం బట్టలో..పధ్ధతిగా లేకపోవడమో కాదు..ఏ అంశాలు వారిని ప్రభావితం చేస్తున్నాయో కూడా తెలీడం లేదు. కాని జరగాల్సిన అనార్ధాలు జరిగిపోతున్నాయి. ప్రతి పిల్లలకు తల్లిగా నేర్పాల్సిన కొన్ని విషయాలుంటాయి. అయితే ఆడ , మగ అనే తేడాలేకుండా మగపిల్లలకు చెప్పాల్సినవి చెప్పాలి. తెలీక చేసే ప్రతి తప్పును తల్లే సరి చేయగలదు. ఇంతకీ ఏ విషయాలు చెప్పాలో చూద్దాం రండి.
* రెండేళ్లు దాటిన ప్రతి పిల్లలకు గుడ్ టచ్ , బ్యాడ్ టచ్ నేర్పించాలి. వారు చెప్పే ప్రతి విషయాన్ని మీరు ఓపిక గా వినండి. అప్పుడే వాళ్లు మీతో ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడతారు. మీరు వాళ్లని నమ్మితేనే..వాళ్లు మిమ్మల్ని నమ్ముతారు.
* ఎవరైనా తాకినా, ఏదైనా ఇబ్బంది పెట్టినా ఆ విషయం మీకు చెప్పే ధైర్యం మీరు పిల్లలకు ఇవ్వాలి. కాబట్టి పిల్లలతో పూర్తిగా స్ట్రిక్ట్ గా ఉండకండి. వారిని అర్ధం చేసుకొండి.
* పిల్లలకు చిన్న వయసు నుంచే తప్పేదో, ఒప్పేదో నేర్పించాలి. దీని వల్ల..పిల్లలు చెడు స్నేహాలకు దూరంగా ఉంటారు. మంచికి, చెడుకి మధ్య బేధం తెలుసుకుంటారు. చెడు స్నేహాలు చేయడం వల్ల ఎంత నష్టపోతారో వాళ్లకి అర్ధమయ్యేలా చెప్తూ ఉండండి.
* ఆడపిల్లలకు మగవారితో స్నేహం ఎంత వరకు చెయ్యాలో చెప్పండి. మన లిమిట్ దాటి మగపిల్లలతో మాట్లాడితే తప్పు జరిగే అవకాశముందని చెప్పండి.
*నైట్ పార్టీస్ కాని పెద్ద గా పరిచయం లేని ఫ్రెండ్స్ కాని ...మీ స్నేహితుల అన్నలు, తమ్ముళ్లతో ఎవ్వరు లేని టైంలో మాట్లాడకూడదని చెప్పండి. ఆడపిల్లల విషయంలో ప్రతి చిన్న విషయం చాలా ఇంపార్టెంట్.
* మగపిల్లలకు కూడా ..ఆడవారిని ఎలా చూడాలో చెప్పండి. ప్రతి ఆడపిల్లలో అక్కని , చెల్లిని చూడాలని చెప్పండి.
ఎదిగిన తర్వాత వచ్చే ఆలోచనలు ..పదేళ్లకే వస్తున్నాయంటే తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించండి. ఆడపిల్లలు పడే చిన్న ఇబ్బందులు కూడా మీ ఇంట్లో మగపిల్లలకు చెప్తూ ఉండండి. ఇది చాలా ముఖ్యం. అన్ని ఆడపిల్లలకే కాదు..మగపిల్లలకు కూడా జాగ్రత్తలు చెప్పాలి.