Bigg Boss8: బ్యాంకాక్ పిల్ల..బిగ్ బాస్ 8 లోకి నిజమేనా ?

యూట్యూబ్ కంటెంటర్ కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందంటున్నారు.  యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ బ్యాంకాక్ పిల్ల కూడా బిగ్ బాస్ 8 లో వస్తుందంటున్నారు.


Published Jul 31, 2024 06:51:51 AM
postImages/2024-07-31/1722426696_bangkokpilla1722351310.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: బిగ్ బాస్ 8 త్వరలో ప్రారంభం అవుతుంది. ఫస్ట్ ప్రోమో కూడా వచ్చేసింది. కంటెస్టెంట్స్ దాదాపు ఖరారు అయినట్టే. కాని ఇప్పుడు ఫేమస్ యూట్యూబ్ కంటెంటర్ కూడా కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉందంటున్నారు.  యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్ బ్యాంకాక్ పిల్ల కూడా బిగ్ బాస్ 8 లో వస్తుందంటున్నారు.


సీజన్ 6 ప్లాప్ కావడంతో సీజన్ 7 కొత్తగా డిజైన్ చేసి సక్సెస్ అయ్యారు. ఉల్టా పల్టా అంటూ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచారు. గతంలో చూడని పవర్ అస్త్ర, ఫినాలే అస్త్ర వంటి కాన్సెప్ట్స్ సీజన్ 7లో ఇంట్రడ్యూస్ చేశారు. రీతూ చౌదరి, విష్ణుప్రియ, యూట్యూబర్ అనిల్, బంచిక్ బబ్లు, ఖయ్యూమ్ అలీ, సోనియా సింగ్, అమృత ప్రణయ్, యాదమ్మ రాజు ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నారట. అబ్బాస్, వినోద్ కుమార్, నటుడు రోహిత్, క్రికెటర్ అర్జున్ అంబటి, వేణు స్వామి పేర్లు కూడా వినిపిస్తున్నాయి.ఇందులోనే కుమారి ఆంటీ ..బ్యాంకాక్ పిల్ల పేర్లు కూడా చాలా గట్టిగా వినిపిస్తున్నాయి.


ఉత్తరాంధ్రకు చెందిన తెలుగు అమ్మాయి శ్రావణి పెళ్లి చేసుకుని బ్యాంకాక్ వెళ్ళింది. ఆ దేశంలోని వింతలు విశేషాలు తెలియజేస్తూ వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యింది. ఆమె యూట్యూబ్ ఛానల్ కి ఏకంగా 2 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఈ బ్యాంకాక్ పిల్లకు బిగ్ బాస్ సీజన్ 8లో ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.  చాలా హుషారైన పిల్ల వస్తే ఫుల్ ఫన్ అంటున్నారు నెటిజన్లు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu big-boos8

Related Articles