ఇలా నాట్లు వేసే సమయంలో ఆ పనులు చేయడం వల్ల కనీసం మొక్కజొన్న, పత్తి వంటివి కూడా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. నిజాం కాలం నాటి నుండి ఉన్న RDS కెనాల్ నీళ్లు విడుదల చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని అన్నారు.
న్యూస్ లైన్ డెస్క్: పక్కనే తుంగభద్ర, కృష్ణా నదులు ఉన్నా.. భూములు మాత్రం ఎండిపోయి బీళ్లుగా మారుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట పండించడానికి నీళ్లు లేవంటూ అలంపూర్ రైతులు తమ గోడు వెళ్లబోసుకుంటూ ఓ వీడియో విడుదల చేశారు. ఓవైపు కృష్ణ నది.. మరోవైపు తుంగభద్రా నది ఉన్నప్పటికీ పంట పండించే అదృష్టం లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం కోసం ఇప్పుడే పనులు మొదలు పెట్టారని, దాని కారణంగా ప్రభుత్వం నీళ్లు వదలడం లేదని ఓ రైతు వాపోయాడు. ఎత్తిపోతల పథకం పనులను ఎండాకాలంలో చేసుకోవాలి. కానీ, ఇలా నాట్లు వేసే సమయంలో ఆ పనులు చేయడం వల్ల కనీసం మొక్కజొన్న, పత్తి వంటివి కూడా సాగు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని అన్నారు. నిజాం కాలం నాటి నుండి ఉన్న RDS కెనాల్ నీళ్లు విడుదల చేయాలని ఆయన కోరారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు లేక భూములు ఎండిపోతున్నాయని అన్నారు.
ఏం పాపం చేశామని ఈ శిక్ష వేశారని ప్రశ్నించారు. ఏ సయమంలో ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలో ప్రభుత్వానికి తెలియదా అని ఆయన ప్రశ్నించారు. రైతులు ఎంతో ఇబ్బంది పడుతున్నారని వెల్లడించారు. ఇప్పటికైనా సర్కార్ స్పందించి తమకు నీటిని విడుదల చేయాలని కోరారు.