Farmers: విద్యుత్ కోతలు.. సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

విద్యుత్ కోతలు భరించలేక రైతులు సబ్ స్టేషన్ ముట్టడించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.


Published Jul 18, 2024 05:10:42 AM
postImages/2024-07-18/1721293307_far24.jfif

న్యూస్ లైన్ డెస్క్: విద్యుత్ కోతలు భరించలేక రైతులు సబ్ స్టేషన్ ముట్టడించారు. ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లాలో చోటు చేసుకుంది.  జడ్చర్ల నియోజకవర్గం ఊర్కొండ మండలంలోని జాకినాల పల్లి సబ్ స్టేషన్ ముందు ఉర్కొండ పేట రైతులు గురువారం పెద్ద ఎత్తున్న ఆందోళనకు దిగారు. గత 6 నెలల నుండి పగలు, రాత్రి అనే తేడా లేకుండా విద్యుత్ సరఫరాలో అంతరాయం కొనసాగుతుండడం పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోకపోవడం లేదని రైతులు మండిపడ్డారు. విద్యుత్ కోతల వల్ల పంట నష్టం జరుగుతుందని వాపోయారు. సరైన సమయానికి నీళ్లు, కరెంటు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని రైతులు తమ గోడ వెళ్లబోసుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోకపోతే ఏడిఈ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కరెంటు కోతల సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఈవోకు రైతులు అందరూ వినతి పత్రం అందజేశారు. 

newsline-whatsapp-channel
Tags : india-people farmers electricity-cuts problems

Related Articles