ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు పిల్లల విషయంలో చాలా లేట్ చేస్తున్నారు. ఇండియాలో 30 ఏళ్లు దాటిన కొంతమంది పెళ్లి చేసుకోవడం లేదు. చేసుకున్న 35 ఏళ్లకు మొదటి సంతానం, ఇక
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుత కాలంలో చాలామంది పెళ్లిళ్లు పిల్లల విషయంలో చాలా లేట్ చేస్తున్నారు. ఇండియాలో 30 ఏళ్లు దాటిన కొంతమంది పెళ్లి చేసుకోవడం లేదు. చేసుకున్న 35 ఏళ్లకు మొదటి సంతానం, ఇక తర్వాత రెండవ సంతానానికి చాలా టైం తీసుకుంటున్నారు. అలా 45 ఏళ్లకు రెండో సంతానం వంటివి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది ఎక్కువగా ప్రాత్యాత్య దేశాల్లో ఉంటుంది కానీ ఇది మన దేశంలోకి కూడా పాకింది. చేసుకున్నదే లేటు వయసులో పెళ్లి అంటే ఇంకా పిల్లల విషయంలో మరింత లేట్ చేస్తూ అనేక ఇబ్బందుల పాలవుతున్నారు.
తాజాగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధన ప్రకారం పురుషులు ఆలస్యంగా పిల్లల్ని కనడం వల్ల పుట్టే పిల్లలకు అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయని వెల్లడించింది. వారి భవిష్యత్తులో పితృత్వం విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయట. ఈ సర్వే మన దేశానికి చెందినది కాకపోయినా మన దేశంలో కూడా అలా ఫాలో అయ్యే వారు చాలామంది ఉన్నారు. జాబులు చేస్తున్న వ్యక్తులు జీవితంలో సెటిల్ అవ్వాలని పిల్లల్ని కనడంలో చాలా లేట్ చేస్తున్నారు. కొంతమంది 40 ఏళ్ల దాటక కూడా పిల్లల్ని కనడం లేదు. సాధారణంగా పురుషులకు ఏ వయసులో అయినా తండ్రి అయ్యే అవకాశం ఉంటుంది. కానీ స్త్రీలకు సాధ్యం కాదు. దీంతో చాలామంది పునరుత్పత్తి సాంకేతిక చికిత్సల సాయం తీసుకొని పిల్లల్ని కంటున్నారు. ఇలా లేటు వయసులో పిల్లల్ని కనడం వల్ల నెలలు నిండకముందే పుట్టే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా తక్కువ బరువుతో పుట్టి జీవితంలో అనేక అనారోగ్య సమస్య ఎదుర్కొంటున్నారు.
ఇదే కాకుండా ఆరోగ్య సమస్యలతో పాటు లింగంపై ప్రభావం పడుతుందని సర్వేలో వెళ్ళడైనట్టు తెలుస్తోంది. 70 ఏళ్ళు ఆపై దాటిన వారు పిల్లల్ని కంటే, వారికి కొడుకులు పుట్టే అవకాశం తక్కువ అని అంటున్నారు. అలాంటి వారికి ఎక్కువగా అమ్మాయిలు పుడతారని తెలియజేస్తున్నారు. అయితే సమాజంలో వస్తున్న మార్పులు పెరుగుతున్న పితృత వయస్సు కారణంగా ఈ పరిశోధన చేశారట. అందుకే మన పెద్దలు అన్నారు ఏ వయసులో తీర్చుకోవాల్సిన ముచ్చట ఆ వయసులో తీర్చుకోవాలని. అలా తీర్చుకోకపోతే వారు ఈ భూమిపై పుట్టి వేస్ట్ అని అన్నారు. అందుకే మన పెద్దలు ఏ సామెత చెప్పిన దాని వెనుక ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ అయితే ఉంటుంది.