Fire Accident: ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.


Published Jul 10, 2024 09:12:26 PM
postImages/2024-07-10//1720626146_fireon22.PNG

న్యూస్ లైన్ డెస్క్: హైదరాబాద్ నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మెట్రో స్టేషన్ కింద ఉన్న కాంప్లెక్స్‌లో భారీగా మంటలు చెలరేగాయి. దత్తసాయి కాంప్లెక్స్‌లో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ విషయం సమాచారం అందుకున్న అగ్నిమాపక సింబ్బది ఘన స్థలానికి చేరుకుని, ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బిల్డింగ్ మూడో ఫ్లోర్ లో మంటలు చెలరేగి నాలుగో ఫ్లోర్ కు వ్యాపించాయి. బిల్డింగ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు సురక్షితంగా కిందకు తీసుకొచ్చారు. ఇక బిల్డింగ్ లోనే ఫర్నీచర్ షాప్ ఉండటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. తపాడియా ఆస్పత్రిలో ఉన్న రోగులను అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana fire-accident rtc

Related Articles