బంగారం ఈ రోజు కూడా 10 గ్రాముల మీద 100 రూపాయిలు తగ్గింది. అంటే గ్రాము బంగారానికి 10 రూపాయిలు తగ్గింది.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: బంగారం ధర రోజు తగ్గుతున్నట్లే ఉంది. కొనడానికి మాత్రం చుక్కలు చూపిస్తుంది. పావలా తగ్గుతుంది...రెండు రూపాయిలు పెరుగుతుంది. తప్పదు బంగారం కదా...శుభకార్యాలు నడుస్తున్నాయి. బంగారం కొనేవాళ్లు ఎక్కువవుతున్నారు. ఇలాంటి టైంలో పావలా తగ్గినా తగ్గడమే. బంగారం ఈ రోజు కూడా 10 గ్రాముల మీద 100 రూపాయిలు తగ్గింది. అంటే గ్రాము బంగారానికి 10 రూపాయిలు తగ్గింది.దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,020కి చేరువైంది.
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 67 వేల 800గా ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 170 వద్ద అమ్మకాలు జరుగుతున్నాయి.
చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 930, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 020 రూపాయిలుగా కొనుగోళ్లు జరుగుతున్నాయి.
ముంబయిలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.73 వేల 020గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల 020 వద్ద నడుస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో మాత్రం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66 వేల 930కాగా, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 73 వేల 020 వద్ద కొనసాగుతోంది. ఏపీలోని విజయవాడతో పాటు, విశాఖపట్నంలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
ఇప్పుడు బంగారం ధరతో ఈక్వల్ గా వెండి ధరలు నడుస్తున్నాయి. బుధవారం కిలో వెండి రూ.100 పెరిగింది. ఢిల్లీ, కోల్‌కతా, పుణె, ముంబయి తదితర నగరాల్లో కిలో వెండి రూ. 88 వేల 600 వద్ద కొనసాగుతోంది. అయితే దక్షిణ భారతదేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో అత్యధికంగా రూ. 93 వేల 600 పలుకుతోంది. కాస్త తగ్గడం బెంగుళూరులో మాత్రమే నాలుగు వందలు కేజీ మీద మిగులు కనిపిస్తుంది.