Gold Rate Today:భారీగా తగ్గిన బంగారం ధర..ఈరోజు  ఎంతంటే?

ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ అంటే ఇష్టపడతారు.  అందుకే ఇండియాలో బంగారం రేట్లు ఎప్పుడు డిమాండ్ లోనే ఉంటాయి.  ఇప్పటివరకు బంగారం రేటు పెరుగుకుంటూ రావడం మీద తప్ప తగ్గింది అయితే లేదు.  అలాంటి ఈ


Published Sep 08, 2024 09:46:51 AM
postImages/2024-09-08/1725769011_GOLD.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఇండియన్స్ ఎక్కువగా గోల్డ్ అంటే ఇష్టపడతారు.  అందుకే ఇండియాలో బంగారం రేట్లు ఎప్పుడు డిమాండ్ లోనే ఉంటాయి.  ఇప్పటివరకు బంగారం రేటు పెరుగుకుంటూ రావడం మీద తప్ప తగ్గింది అయితే లేదు.  అలాంటి ఈ తరుణంలో ఈరోజు బంగారం రేట్లు తరుగుదల బాట పట్టాయి. ఎవరైనా బంగారం కొనుక్కోవాలి అనుకునే వినియోగదారుడు ఈరోజు కొనుగోలు చేస్తే బాగుంటుందని అంటున్నారు. మరి ఈరోజు గోల్డ్ రేట్ ఎంతుంది ఆ వివరాలు ఏంటో చూద్దాం.

 మొన్నటి వరకు  బంగారం రేటు పెరగడమే తప్ప తగ్గింది అయితే లేదు. కానీ కొన్ని రోజులుగా రేట్లు కాస్త కిందికి దిగివస్తున్నాయి.  ఆదివారం ( సెప్టెంబర్ 8 ) ఇండియన్ మార్కెట్ లో బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. అంతేకాకుండా వెండి ధరలు కూడా  కిందికి వస్తున్నాయి. ఇక ఈ బంగారం ధర సెప్టెంబర్ 7 తో పోలిస్తే ఈరోజు రూపాయలు 410 తగ్గిందని తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తే దేశీయంగా 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను  రూ:72,870 గా ఉన్నది.. అంతేకాకుండా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు గాను  రూ:66,800గా ఉన్నది.

 హైదరాబాద్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ:66,800, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం  రూ:72,870

 విజయవాడ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర  రూ:66,800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర  రూ:72,870 గా ఉన్నది. 
 ముంబై మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రూ:66,800, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్  రూ:72,870గా కొనసాగుతోంది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu gold silver-rate womens- gold-rate market

Related Articles