Harish Rao: జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును ఖండిస్తున్న

ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ సమస్యలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-10/1720604134_hboss.webp

న్యూస్ లైన్ డెస్క్: ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ సమస్యలను కవర్ చేయడానికి వెళ్లిన జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమేనాని అన్నారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. కొన్ని నెలలుగా డీఎస్సీ అభ్యర్థులు నిరసన చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. గతంలో నిరుద్యోగులను రెచ్చగొట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకుని, నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

newsline-whatsapp-channel
Tags : telangana mla brs journalist harish-rao

Related Articles