న్యూస్ లైన్ డెస్క్ : మానేరు పరివాహక ప్రాంత ప్రజలకు అధికారులు ముందస్తు హెచ్చరిక చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ఏ క్షణంలో అయినా ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదిలే అవకాశం ఉంది. కాబట్టి రెవెన్యూ, పోలీసు శాఖ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నీటి పారుదల శాఖ అధికారులు సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
నదీ పరివాహక ప్రాంతంలోకి పశువులను మేతకు తీసుకెళ్లొద్దని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ముంపునకు గురయ్యే అవకాశం ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ప్రజలకు బయటకు రావాలని.. ప్రవహించే కాలువలు, వాగుల వద్దకు వెళ్లొద్దని హెచ్చరించారు.